BigTV English

Urban Floods: పట్టణీకరణ.. నగరాల్లో వరద ముంపు..

Urban Floods: పట్టణీకరణ.. నగరాల్లో వరద ముంపు..

Urban Floods: పట్టణాలు, నగరాల్లో వరద ముప్పు తీవ్రత పెరుగుతోంది. పట్టణీకరణ కారణంగా వరద ముంపులో చిక్కుకుంటున్న ప్రాంతాలు ఎన్నో. 1985-2015 మధ్య తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వరద సమస్య 7.8 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది.


వాతావరణ మార్పులతో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లోనే ఆవాసాల ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపుతుండటం వల్లే కష్టాలు మరింత పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని మానవ ఆవాసాల్లో 5.2 శాతం మాత్రమే తీవ్ర వరద ముంపును ఎదుర్కొంటున్నాయి. 100 ఏళ్ల‌లో వరద లెక్కలను పరిశీలిస్తే.. 1.5 మీటర్ల మేర ముంపులో కూరుకుపోతున్నాయి.


అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో వరద ముంపు అత్యధికంగా ఉన్నది వియత్నాంలోనే. అక్కడ 31.2 శాతం మేర ఆవాసాలు నీటిలో మునిగిపోతున్నాయి. లావోస్‌లో ముంపు ప్రాంతం 28.7%, బంగ్లాదేశ్‌లో 23.4 శాతంగా ఉంది.

ఇక ఫిజిలో 12.7 శాతం, భూటాన్ 12.5%, ఈజిప్టు 10.7%, చైనా 9.8, ఉత్తర కొరియా 9.5, బోస్నియా-హెర్జ్‌గోవియా 8.8, మాంటినెగ్రోలో 8 శాతం మేర జనావాసాలకు ముంపు సమస్య ఉంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×