BigTV English

Allu Arjun: బాలీవుడ్ వాళ్లకు ఈగో ఎక్కువ… బన్నీకి మాత్రం కాదు… కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు..!

Allu Arjun: బాలీవుడ్ వాళ్లకు ఈగో ఎక్కువ… బన్నీకి మాత్రం కాదు… కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు..!

Allu Arjun..సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే దానికి ప్రధాన కారణం హీరో, దర్శకుడు అని మాత్రమే చెబుతారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే 24 విభాగాలు సరిగ్గా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది అనే విషయం చాలామంది గ్రహించరు. అందుకే విజయం సాధించినప్పుడు ప్రతి ఒక్కరు కేవలం దర్శకుడిని, హీరోని మాత్రమే మెచ్చుకుంటారు. కానీ ఆ విజయానికి దోహదపడ్డ వారిని మాత్రం ప్రత్యేకంగా గుర్తించరు. అయితే ఇలాంటి సందర్భాలు కేవలం నార్త్ ఇండియాలోనే చూస్తామని.. ఇలాంటి సందర్భాలకు దక్షిణాది సినీ పరిశ్రమ పూర్తిగా విరుద్ధమని.. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య (Ganeah Acharya) చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సొంత సినీ పరిశ్రమనే విమర్శిస్తూ..ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


అల్లు అర్జున్ చేసిన పనిని జీవితంలో మర్చిపోలేను- కొరియోగ్రాఫర్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్లో పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన ఈయన.. టాలీవుడ్ లో మాత్రం అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar ) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఇలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ,తనను అల్లు అర్జున్ పిలిచి మరీ ప్రశంసించారని.. ఇక ఈ విషయాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇక అసలు విషయంలోకెళితే కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


ఉత్తరాది కంటే దక్షిణాది సినీ పరిశ్రమ ఎంతో బెటర్..

ఇదే విషయంపై గణేష్ ఆచార్య మాట్లాడుతూ.. “నార్త్ సినీ ఇండస్ట్రీతో పోల్చుకుంటే.. దక్షిణాది సినీ పరిశ్రమలో టెక్నీషియన్లకు మంచి గుర్తింపుతో పాటు గౌరవం కూడా ఇస్తారు. ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీల లాగా పదేపదే మేకప్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి తమ పాత్రకు సంబంధించి మేకప్ వేసుకుంటే.. ఇక నేరుగా లంచ్ కి వెళ్ళిపోతారు. మధ్యలో మళ్లీ ముఖానికి రంగు వేసుకోరు. అసలు మేనేజర్ల హడావిడి ఉండదు. అంతా ఒక పద్ధతిగా, సైలెంట్ గా, క్రమశిక్షణగా సాగిపోతుంది. ఇక డాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శక నిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని దానిని అలాగే పాటలో ఉంచాల్సిందే అంటూ మా ముందే బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉంటారు. వారు అభ్యంతరం చెబితే మాత్రం చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమని మాతో చెబుతారు. అలా పాట కోసం కష్టపడి.. మళ్లీ వారు చెప్పింది పదేపదే వినడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు బాలీవుడ్లో ఎన్నో ఎదుర్కొన్నాను.. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకి ఈగో చాలా ఎక్కువ”. అంటూ తెలిపారు.

దక్షిణాదిలో లైట్ మెన్ లకి కూడా అవార్డులు ఇస్తారు..

“ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ అందించాను. ఆ కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ నన్ను పిలిచి మరీ అభినందించారు.” మాస్టర్.. మీ వల్లే ఇదంతా సాధ్యమైంది” అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ నన్ను గుర్తించి అభినందించడంతో నాకు మాటలు రాలేదు. అంతేకాదు హైదరాబాదులో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి కూడా నన్ను ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రతి టెక్నీషియన్ కూడా ఆ పార్టీలో భాగమయ్యారు. ఇక స్టేజ్ పై పుష్ప సినిమాకు పనిచేసిన లైట్ మెన్ కి కూడా అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇది నన్ను చాలా సంతోషపరిచింది. బాలీవుడ్ పరిశ్రమలో మాత్రం మనుషులను తక్కువ చేసి చూస్తారు. అది మాకు ఎంతో బాధను కలిగిస్తుంది” అంటూ గణేష్ ఆచార్య కామెంట్లు చేశారు. మొత్తానికైతే దక్షిణాది పరిశ్రమపై అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇది విన్న నెటిజన్స్ ఇప్పటికైనా నార్త్ సెలబ్రిటీలు తమ పద్ధతిని మార్చుకోవాలని, తమ వారు సెలెబ్రిటీస్ ల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి.. అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గణేష్ ఆచార్య పుష్ప సినిమాలో “దాక్కో దాక్కో మేక”, “ఉ అంటావా మావా” పాటలకు కొరియోగ్రఫీ చేయగా.. పుష్ప2 లో “కిస్సిక్ “పాటతో పాటు “సూసేకి అగ్గురవ్వ మాదిరి “పాటకు స్టెప్పులు నేర్పించారు.

?utm_source=ig_web_copy_link

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×