Garikipati Narasimha Rao: ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేచి ఆయన ప్రవచనాలు విన్నందే రోజును మొదలుపెట్టరు కొంతమంది. పురాణాలు, ఇతిహాసాలు, బంధాలు, బాంధవ్యాలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి. భర్త భార్యతో ఎలా ఉండాలి.. ? కుటుంబం ఎలా ఉండాలి.. ? ఇలా ఏ ఒక్కటి వదలకుండా ఆయన చెప్పే ప్రవచనాలను చాలామంది భక్తులు ఉన్నారు. కేవలం ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఆయనకు భక్తులుగా ఉన్నారు.
సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా పూర్తిచేసిన అవధానిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకేమైన గుర్తింపు ఉంది. అలాంటి గరికపాటిపై కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గరికపాటి ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఆయన మొదటి భార్య కామేశ్వరి ఈ మధ్య ఒక వీడియోను రిలీజ్ చేయడం సెన్సేషన్ గా మారింది. ఆ వీడియోలో ఆమె గరికపాటిపై ఎన్నో అభాండాలు వేసింది.
Sandeep Kishan: బాలీవుడ్ ని నమ్మి మోసపోయా.. చివరి నిమిషంలో అంటూ ఊహించని కామెంట్స్..!
” గరికపాటి అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి చిన్నతనంలోనే నన్ను లాకొచ్చి మెడలో దండ వేసి పెళ్ళాన్ని చేసుకున్నాడు. మంచి భర్త, ఇద్దరు పిల్లలను ఇవ్వమని దేవుడిని అడిగితే పిల్లలను ఇచ్చాడు. కానీ, భర్త.. 25 ఏళ్ళు నేను వాడిని భరించలేకపోయాను. ఉద్యోగం లేదు.. డబ్బు లేదు. ఉన్న ఇంటిని తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకుని రాయించుకున్న దుష్టుడు. ఇంత చూసాక పిల్లల భవిష్యత్తు గురించి అలోచించి నేను బయటకు వచ్చేసాను. ఆ తరువాత వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నా పిల్లలను మంచిగానే పెంచాడు. పెళ్లి చేసాడు. నేనేదో అంటే.. విడాకులు తీసుకొని ఎందుకు వచ్చావు అని అంటున్నారు. నేనేం ఒళ్ళు బలిసి రాలేదు. వారి ఫ్యూచర్ కోసం ఆలోచించి వచ్చాను. ఇప్పటికీ వారి గురించే ఆలోచిస్తూ బతుకుతున్నాను.
నాకేది రాదన్నాడు.. సంస్కృతం లో డిగ్రీ చేశా.. తెలుగులో చేశా.. లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యాను. చిన్నతనం నుంచి నాకు తెలుసు వీడు. పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నవీడే.. తల్లి వరుసను కూనీ చేశాడు. తన భవిష్యత్తుకు అడ్డు వస్తున్నా అని హింసించి నన్ను పంపించేశాడు. ఇప్పటివరకు నేను బయటకు రాలేదు. అసలు వచ్చేదాన్ని కూడా కాదు. కానీ , ఈ నీచుడు యూట్యూబ్ లలో మాట్లాడుతూ.. నేను శ్రీరాముడిని.. ఏ తప్పు చేయలేదు. మీకు అన్యాయం జరిగితే మాట్లాడాలి.. ఎదిరించాలి అని చెప్పుకొచ్చాడు. అది విన్నాక నాకు కూడా అనిపించింది.. నాకు అన్యాయం జరిగింది కదా అని అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను.
Game Changer: అలికి పూసిన అరుగు మీద.. కల్ట్ క్లాసిక్ సాంగ్ రా మావా.. రాసిపెట్టుకోండి
నేనేదో నా మానాన వీడియోలు చేసుకుంటే.. నా కన్నకొడుకు చేతనే నాపై పోలీస్ కేస్ పెట్టించాడు. పచ్చని సంసారం నాది. అతని అన్నాను పెళ్లి చేసుకున్నాను. ఆ సంసారంలో చిచ్చుపెట్టి నాకు నరకం చూపించాడు.. ఇప్పుడు ఆయన డబ్బు కోసం వచ్చి ఇదంతా చేస్తున్నాను అని అనుకుంటున్నారు. దానికి నేను రాలేదు” అంటూ ఆమె వీడియో చేసింది. ఇక ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో గరికపాటిపై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇక ఆ వీడియోపై గరికపాటి టీమ్ స్పందించింది. ” పద్మ శ్రీ పురస్కార గ్రహీత అయిన డా. గరికిపాటి నరసింహారావు గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యుట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్య దూరం. అలాగే కొన్ని వేర్వేరు సంఘటనల్లో గురువుగారు ఎవరెవరికో చెప్పని క్షమార్పణలు కూడా చెప్పారని, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా నిరాధార, అసత్య ప్రచారం జరుగుతోంది.
Siva Karthikeyan : సినిమా హిట్ అయితే నాకే క్రెడిట్ ఉండదు… స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
వీటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటివరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన యుట్యూబ్ ఛానెల్స్, సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేయడం జరుగుతుంది. కాబట్టి, ఈ విషయంలో వ్యక్తులు గానీ, సామాజిక మాధ్యమాలు గానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు” అంటూ చెప్పుకొచ్చారు. మరి కామేశ్వరి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందో లేదో తెలియాల్సి ఉంది.