Game Changer: దాదాపు మూడేళ్ల తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే రిలీజైన కొన్నినిమిషాల్లోనే సెన్సేషన్ సృష్టించింది. రా మచ్చా మచ్చా, నానా హైరానా సాంగ్స్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమాలోని ఒక్కో సాంగ్ ను విడుదల చేస్తున్నారు.
Siva Karthikeyan : సినిమా హిట్ అయితే నాకే క్రెడిట్ ఉండదు… స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి మరో అద్భుతమైన ఫోక్ సాంగ్ ఆడియోను రిలీజ్ చేశారు. “అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కుసుంటే.. పలకరించావేంది ఓ దొర…. సిలక ముక్కు చిన్ని నా దొర” అంటూ సాగిన ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది . ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రతి సినిమాలో కూడా ఓకే ఫోక్ సాంగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈ సాంగ్ కల్ట్ క్లాసిక్ గా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఆ లిరిక్స్ కు సంగీతం అందించి అంతే అద్భుతమైన వాయిస్ తో థమన్, ఎస్. రోషిణి ఆలపించారు. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. మొదటి నుంచి తండ్రి అప్పన్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ సాంగ్ వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. అప్పన్న భార్య పార్వతిగా అంజలి కనిపిస్తుంది. అలిగిన భర్తను.. లాలించి, తన గుణగణాలను చెప్తూ భార్య ఎలా సర్ది చెప్పిందో ఈ పాటలో చూపించారు.
Bigg Boss Himaja: బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హిమజ.. ఏమన్నారంటే..?
సాంగ్, మ్యూజిక్ అంతా ఒక ఎత్తు అయితే చరణ్, అంజలి నటన మరో ఎత్తు అని చెప్పాలి. అప్పన్న పాత్రలో చరణ్ నటనను చూస్తుంటే రంగస్థలం సినిమా గుర్తురాక మానదు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంకోపక్క ముందే ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఉంటే.. ఈపాటికే ఈ సాంగ్ సెన్సేషన్ సృష్టించేది అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.