Siva Karthikeyan ..ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో అన్నీ సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా చేసే ప్రతి పాత్రతో కూడా మంచి గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు శివ కార్తికేయన్. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్.. ఇటీవల ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి(Sai pallavi)లీడ్ రోల్ పోషించింది.
ఇండస్ట్రీలో కామన్ మ్యాన్ ఎదిగితే సహించరు..
దివంగత మేజర్ ఉన్ని ముకుందన్(Major Unni mukundan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. దీంతో శివ కార్తికేయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈయనకి అభిమానులు పెద్ద సంఖ్యలో పెరిగి పోయారు. తాజాగా ఈయన సుధా కొంగర దర్శకత్వంలో “SK -25” అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కార్తికేయన్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి ఒక కామన్ మ్యాన్ వచ్చి ఎదిగాడు అంటే, కొంతమంది బాగానే వారికి వెల్కమ్ చెబుతారు. కానీ మరికొంతమంది మాత్రం అస్సలు సహించరు. అంత ఎంకరేజ్ కూడా చేయరు..
కొంతమంది ఎవడ్రా నువ్వు? అన్నారు..
ఎవడ్రా వీడు.. అని మాత్రం అనుకుంటారు. కొంతమంది అయితే నా మొహం మీదే చెప్పేశారు.. ఎవడ్రా నువ్వు..? ఇక్కడ నీకేం పని? అన్నారు. కానీ అలా అన్నా కూడా నేను వారిని చూసి నవ్వుకొని సైలెంట్ గా తప్పుకున్నాను. నేను ఎవరికీ కూడా రిప్లై ఇవ్వాలని అనుకోవట్లేదు. వారందరికీ నా సక్సెస్ రిప్లై ఇస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అది అద్భుతంగా వర్క్ చేస్తున్న నా టీంకు, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు మాత్రమే అంకితం. అంతేకాదు కొంతమంది నన్ను నీలాగే కావాలి అనుకుంటున్నాము అని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటున్న వారికి కూడా.. అయితే నా సినిమా సక్సెస్ అయినా కూడా కొంతమంది నాకు క్రెడిట్ ఇవ్వడం లేదు. మిగిలిన వారందరికీ క్రెడిట్ ఇస్తారు. కానీ ఫెయిల్ అయితే మాత్రం ఒక గ్రూపుగా అందరూ నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్ అయితే నన్ను సపోర్ట్ చేసి నన్ను అంగీకరించిన వాళ్ళు కొంతమంది అయితే, అసలు నన్ను దూరం పెడుతున్న వాళ్లు ఇంకొంతమంది ఉన్నారు” అంటూ తెలిపారు. ఇక శివ కార్తికేయన్ మాట్లాడిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇది చూసిన కొంతమంది కొంపతీసి శివ కార్తికేయన్ నెపోటిజం పై మాట్లాడారా? అన్నట్టుగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారికి ఎప్పటికీ ఆడియన్స్ అండగా ఉంటారంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
“I can smoke onscreen but the character should convince me & has justification for it✌️. Just putting a cigarette on mouth & saying “I will kill you”, then I don’t want to do it, unless it’s an antagonist character🚬”
– #SivaKartikeyanpic.twitter.com/LVVm0G3EjT— AmuthaBharathi (@CinemaWithAB) January 7, 2025