BigTV English

Sandeep Kishan: బాలీవుడ్ ని నమ్మి మోసపోయా.. చివరి నిమిషంలో అంటూ ఊహించని కామెంట్స్..!

Sandeep Kishan: బాలీవుడ్ ని నమ్మి మోసపోయా.. చివరి నిమిషంలో అంటూ ఊహించని కామెంట్స్..!

Sandeep Kishan : చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పుట్టారు నటుడు సందీప్ కిషన్ (Sandeep Kishan). ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈయన సౌత్ లో ఎన్నో మంచి సినిమాలు చేసి నటుడిగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలా సందీప్ కిషన్ కి మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ హిట్ పడింది మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో మాత్రమే.. అంతకుముందే స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ వంటి సినిమాలతో నటించినప్పటికీ గుర్తింపు రాలేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో సందీప్ కిషన్ కి తెలుగులో అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో జోరు, బీరువా, రారా కృష్ణయ్య, మైఖేల్, గుండెల్లో గోదారి, శమంతకమణి వంటి సినిమాల్లో నటించారు. అయితే అలాంటి సందీప్ కిషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.


ఇకపై నేరుగా హిందీలో సినిమాలు చేయను..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “నాకు తెలుగులో అవకాశాలు రాకముందే బాలీవుడ్ లో రెండు పెద్ద బ్యానర్లలో, రెండు పెద్ద సినిమాల్లో హీరో గా అవకాశం వచ్చింది. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే బాలీవుడ్ లోనే ఆ రెండు సినిమాలకు సైన్ చేసిన తర్వాత తమిళంలో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ అంత పెద్ద సంస్థల్లో సినిమాలు వదిలిపెట్టుకొని ఈ సినిమాలు చేయడమేంటి అని, ఆ సినిమాలను రిజెక్ట్ చేశాను. అయితే ఆ బాలీవుడ్ సినిమాల్లో హీరో అవకాశం ఇచ్చారని, దాదాపు రెండు సంవత్సరాలు ఇంట్లో ఖాళీగానే కూర్చున్నాను. కానీ తర్వాత మోసపోయాను అని తెలిసింది. ఎందుకంటే నేను ఒప్పుకున్న రెండు ప్రాజెక్టుల్లో నన్ను మోసం చేసి నన్ను తీసేసి, వేరే ఇద్దరిని పెట్టుకుని, ఆ సినిమాలు స్టార్ట్ చేశారు. దాంతో నాకు చాలా బాధేసింది. రెండేళ్లు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మోసం చేస్తారా? అనుకున్నాను. అందుకే బాలీవుడ్ వదిలేసి సౌత్ లో నిజాయితీగా ఉండాలి అని ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సినిమాల్లో నటిస్తున్నాను. అయితే బాలీవుడ్లో నటించకూడదు అని కాదు, హిందీ భాష కోసం అక్కడ సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. నేను నా భాషలోనే సినిమాలు చేస్తాను” అని అన్నారు.


సౌత్ లో సక్సెస్ అయితేనే.. హిందీలో రిలీజ్ చేస్తా..

అలాగే “ఒకవేళ అవి బాగుంటే హిందీలో కూడా వాటిని రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అలాగే రిలీజ్ చేస్తున్నారు కదా”.. అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. సందీప్ కిషన్ “ది ఫ్యామిలీ మెన్” అనే వెబ్ సిరీస్ తో పాటు “షోర్ ఇన్ ది సిటీ” అనే బాలీవుడ్ మూవీలో నటించారు. ఆ తర్వాత పూర్తిగా సౌత్ లోనే మూవీస్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాతో హీరోగా మారారు. అలా వరుస సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో హీరోగా ఫిక్స్ అయిపోయారు. ఇక గత ఏడాది ఈయన నటించిన “ఊరు పేరు భైరవకోన” మూవీ హిట్ అయింది. అలాగే ధనుష్ హీరోగా చేసిన “రాయన్” మూవీలో కూడా కీ రోల్ పోషించారు. అలాగే ధనుష్ (Dhanush) హీరోగా చేసిన మరో సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ లో కూడా సందీప్ కిషన్ నటించారు.అలా హీరో గానే కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉంటే కీ రోల్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక సందీప్ కిషన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా రజినీకాంత్ (Rajinikanth) హీరోగా చేస్తున్న ‘కూలీ’ మూవీలో కూడా సందీప్ కిషన్ ఒక కీ రోల్ పోషిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×