BigTV English

Gundeninda GudiGantalu Today Episode : రవి, శృతిల పెళ్లికి సుమతి సపోర్ట్ .. మీనాను బుక్ చేసిన రవి..

Gundeninda GudiGantalu Today Episode : రవి, శృతిల పెళ్లికి సుమతి సపోర్ట్ .. మీనాను బుక్ చేసిన రవి..

Gundeninda GudiGantalu Today Episode October 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడే బాలు వస్తాడు. ఈ నోటు పార్క్ లోకి ఎలా వచ్చిందని అడుగుతాడు. మనోజ్ తీసుకున్న విషయం తెలిసిందే.. నేను టీ తాగాను అక్కడ పోయింది అంటాడు. ఇక మనోజ్ జేబులోంచి పదివేలు కింద పడుతుంది. పెన్షన్ డబ్బులు నీకు దొరక్కుండా బ్యాంకులో దాచానని ప్రభావతి అబద్ధాన్ని బయటపెడతాడు సత్యం. ఇక బాలు నాదే అని తీసుకుంటాడు.. సత్యంకు సురేంద్ర ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని పిలుస్తాడు. సత్యాన్ని కలుస్తాడు శృతి తండ్రి సురేంద్ర. నీ కొడుకు వల్ల నా కూతురి పెళ్లి ఆగిపోతే ఊరుకోనని సత్యాన్ని హెచ్చరిస్తాడు. సురేంద్ర వార్నింగ్ ఇచ్చిన విషయం బాలుతో చెబుతాడు. మీరు కంగారు పడకండి అంటూ అని సత్యంకు చెబుతాడు. సుమతికి రవి ఫోన్ చేస్తాడు. తమ పెళ్లి సజావుగా జరగడానికి మీనా చెల్లెలు సుమతి సాయం తీసుకోవాలని రవి అనుకుంటాడు. సుమతిని కలిసి తన ప్రేమ విషయం మొత్తం చెప్పేస్తాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతితో తన పెళ్లికి బాలు అడ్డుచెబుతున్న సంగతి కూడా సుమతికి వివరిస్తాడు రవి.. శృతి, తాను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు, ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే చేయాలని సుమతిని రిక్వెస్ట్ చేస్తాడు రవి. సుమతి భయపడుతూనే అందుకు ఒప్పుకుంటుంది.. రవి, శృతిల పెళ్లి తాను జరిపిస్తే అక్క కాపురానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే శృతి ఫోన్ చేస్తుంది.. మాకు నువ్వు తప్ప సాయం చేసేవారు ఎవరూ లేరని అంటుంది. మా ఇద్దరికి పెళ్లి జరగకపోతే చచ్చిపోతామని సుమతితో అంటుంది శృతి. చివరకు శృతి, రవి కలిసి సుమతిని కన్వీన్స్‌చేస్తారు. తన వల్ల మీనా కాపురానికి ఎలాంటి అపద వస్తుందోనని సుమతి కంగారుపడుతూనే వారి పెళ్లి జరిపించడానికి అంగీకరిస్తుంది. శృతిని కలవడానికి సుమతి వెళ్తుంది. శృతి స్నేహితురాలిగా అబద్ధం ఆడుతూ ఆమె ఇంటికి వెళుతుంది సుమతి. కానీ సుమతిని చూసి శోభన, సురేంద్ర అనుమానపడతారు. నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు..

సుమతి కూడా ధైర్యంగా చెప్పడంతో శృతిని కలవడానికి శోభన ఒప్పుకుంటుంది.. సుమతిని జాహ్నవిగా తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది శృతి. జాహ్నవి పెళ్లి రెండు రోజుల్లో ఉందని, పెళ్లికి పిలవడానికి వచ్చిందని అబద్ధం ఆడుతుంది. జాహ్నవి పెళ్లికి తాను వెళ్లితీరుతానని తల్లిదండ్రులతో అంటుంది. బయటకు వెళ్లడానికి వీలులేదని శృతిని మళ్లీ గదిలోకి తీసుకొని వెళ్తారు. సంజుతో పెళ్లి అయ్యేవరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెబుతుంది. ఇక వీళ్లు వెళ్ళనిచ్చేలా లేరు నేనే ఎలాగైనా తప్పించుకొని వెళ్లిపోలని అనుకుంటుంది. ఔట్ స్టేషన్ గిరాకి రావడంతో రెండు రోజులు ఊరు వెళ్లేందుకు బట్టలు సర్ధుతుంటాడు బాలు. రెండు రోజులు భర్తకు దూరంగా ఉండటానికి మీనా మనసు ఒప్పుకోదు. దిగాలుగా మారిపోతుంది. బాలూపై కోపంతో మీనా బట్టలు సర్దుతుంది. వెళ్ళేటప్పుడు ముద్దు ఇస్తాడనికి అనుకుంటుంది. కానీ బాలు బుగ్గ గిల్లుతాడు.


ఇక సుమతికి మరో షాకిస్తాడు రవి. సుమతి తల్లి పూలు అమ్మే గుడిలోనే శృతి, తాను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఆ పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలని అడుగుతాడు. పంతులుతో మాట్లాడి తాను పెళ్లి ఏర్పాట్లు చేస్తానని, పూల దండలు తేవడంతో సాక్షి సంతకాలు చేస్తానని అంటుంది సుమతి. అయితే డబ్బులు ఇవ్వాలని రవి చూస్తే ఏమి అవసరం లేదు శృతిని బాగా చూసుకొమని చెబుతుంది. మీనా బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఏదైనా పెళ్లికి వెళుతున్నావా ఇంతలా ముస్తాబయ్యావని మీనాను ఎగతాళి చేస్తుంది ప్రభావతి. అదే టైమ్‌లో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లిచేసుకోవడానికి గుడికి బయలుదేరుతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో శృతి కూడా ఇంట్లో నుంచి తప్పించుకొని టెంపుల్ దగ్గరకు వస్తుంది. బాలు కారుకు పిల్లి అడ్డు రావడంతో ఏదో కీడు శంకిస్తుందని బాలు అనుకుంటాడు. శృతి, రవి పెళ్లిని మీనానే జరిపించిందని ఆమెపై నిందలు పడతాయి.. ఇక రేపు గుడిలో పెళ్లి చేసుకుంటారా? బాలు పెళ్లిని ఆపుతాడా? పెళ్లి తర్వాత పరిస్థితులు ఏంటి? సత్యం పై సురేంద్ర ఏదైన దాడి చేయిస్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×