BigTV English

Khel Khel Mein Trailer: భర్తల ఫోన్లు భార్యలు చూస్తే.. ఇదేదో సంబంధాలు చెడగొట్టే ఆటలా ఉందే

Khel Khel Mein Trailer: భర్తల ఫోన్లు భార్యలు చూస్తే.. ఇదేదో సంబంధాలు చెడగొట్టే ఆటలా ఉందే

Khel Khel Mein Trailer: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. బడే మియాన్.. చోటే మియాన్, సర్ఫిరా లాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అయినా అక్షయ్ కుమార్ హిట్ కోసం బాగానే కష్టపడుతున్నాడు.


తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం ఖేల్ ఖేల్ మెయిన్. అక్షయ్ కుమార్, అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అప్పుడు తమిళ్ లో లవ్ టుడే సినిమాలో ప్రేమికులు ఫోన్ లు మార్చుకుంటే ఎలా ఉంటుంది అని చూపించారు. ఇక  ఇందులో భర్తల ఫోన్ సీక్రెట్స్  ను భార్యలు తెలుసుకోవడం చూపించారు.


నాలుగు జంటలు.. వారి మధ్య జరిగే గొడవలు లాంటివి చూపించారు. పెళ్లి తరువాత భర్త.. భార్యల దగ్గర కొన్ని దాచేస్తూ ఉంటారు. అనుకోకుండా భర్తల సీక్రెట్స్ భార్యలకు తెలిస్తే.. వారి మధ్య ఎలాంటి గందరగోళం జరిగింది అనేది కథగా తెలుస్తోంది. నాలుగు జంటలు.. ఒక ఫంక్షన్ లో నాలుగు జంటలు సరదాగా అందరి ఫోన్ లు పక్కన పెట్టి.. అప్పుడు వచ్చే కాల్ కానీ, మెసేజ్ కానీ అందరి ముందు ఓపెన్ చేయాలనీ కండిషన్ పెడతారు.

ఇక భర్తల సీక్రెట్స్ భార్యలకు.. భార్యల సీక్రెట్స్ భర్తలకు తెలిసి.. వారి జీవితాలు ఎలా మారాయి అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించారు. ఇందులో అక్షయ్ భార్యగా వాణీ నటించింది. ఇక ప్రగ్యా చాలా గ్యాప్ తరువాత బాలీవుడ్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అక్షయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×