BigTV English

Fake Collections : ఒకరిని మించి ఒకరు… టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్

Fake Collections : ఒకరిని మించి ఒకరు…  టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్

Fake Collections : ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్ల ట్రెండు జోరుగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా స్టార్ హీరోల సినిమాలకు అఫీషియల్ గా ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఇలా చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు అంటూ అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మరి ప్రస్తుతం ఓపెనింగ్ వైజ్ టాప్ 10లో ఉన్న సినిమాలలో ఎన్ని సినిమాల కలెక్షన్స్ నిజం అంటే చెప్పడం కష్టమే.


ఒకరికి మించి ఒకరు… 

ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలలో టాప్ ఫైవ్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాలు ‘పుష్ప 2 (Pushpa 2) – 264 కోట్లు’, ‘కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) – 191.5 కోట్లు’, ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ – 186 కోట్లు, ‘దేవర (Devara) – 172 కోట్లు’ ఉన్నాయి. అయితే ‘పుష్ప 2’ సినిమా నుంచి మొదలు పెడితే ప్రతి సినిమాకు ఫేక్ కలెక్షన్స్ అనే విమర్శలు వినిపించాయి. అఫీషియల్ గా మేకర్స్ ఈ సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ల పోస్టర్ని రిలీజ్ చేసినప్పటికీ, ఇలా ఫేక్ కలెక్షన్లతో గొప్పలు పోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు హీరోల పరువు తీస్తారు ? అనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి.


అయితే నిర్మాతల దగ్గర ఇలా ఫేక్ కలెక్షన్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు తెలివిగా సమాధానాన్ని దాటవేస్తారు. అసలు ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అన్నది నిర్మాతకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఆ కలెక్షన్స్ గురించి మీకెందుకు చెప్పాలి? అనేది నిర్మాతల ప్రశ్న. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇలా పోస్టర్లపై ఫేక్ కలెక్షన్స్ వేస్తామని వాళ్లే పలుసార్లు ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఫేక్ కలెక్షన్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవేనా 186 కోట్లు.. .?

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంత కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఒక సినిమాకు మించి మరొక సినిమా అన్నట్టుగా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తాయి సినిమాలు. అలా చేసుకుంటూ వెళ్లే క్రమంలోని ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలన్ని ఫేక్ కలెక్షన్లు అనే విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా, రాను రానూ గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ కు విలువ లేకుండా పోతుంది.

తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీకి మొదటి రోజే ఏకంగా 186 కోట్ల కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి అంటూ అఫీషియల్ గా పోస్టర్ని రిలీజ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బుక్ మై షో లెక్కల ప్రకారం చూసుకుంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఫస్ట్ డే 404. 88కే టికెట్స్ అమ్ముడయ్యాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేస్తూ, ఇవేనా 186 కోట్ల కలెక్షన్స్ అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అభిమానులు కూడా ఎందుకిలా ఫేక్ కలెక్షన్స్ తో మా హీరోల పరువు తీస్తారు అంటూ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. మరి ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×