CM Revanth Review: ఉస్మానియా కొత్త ఆసుపత్రిపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈనెలాఖరులో ఆసుపత్రికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. అయితే డిజైన్లలో చిన్న మార్పులు-చేర్పులు చేసింది.
సీఎం రేవంత్ నివాసంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోషామహల్‌లో హాస్పటల్ నిర్మించనుంది. అయితే ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియపై ఫోకస్ చేసింది. ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నమూనా మ్యాప్ సీఎంకు వివరించారు అధికారులు. వీటిలో పలు మార్పులు, చేర్పులను సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గోషామహల్‌లో పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు సంబందించి దాదాపు 32 ఎకరాల భూమి ఉంది. పోలీసు విభాగంలో ఉన్న ఆ స్థలాన్ని వెంటనే వైద్య శాఖకు బదిలీ చేయాలన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్లు ఉండాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చేందుకు రోడ్ల కనెక్టివిటీ ఉండాలన్నారు.
ALSO READ: నేతల ఉక్కిరి బిక్కిరి..విచారణ ముందుకు హరీష్‌రావు, ఈటెల
ముఖ్యంగా ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతోపాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ హాస్టల్ నిర్మించాలన్నారు. కార్పొరేట్ తరహాలో సేవలన్నీ అందుబాటులో ఉండాలన్నారు. కేవలం భవనాలు మాత్రమే కాకుండా ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండాలన్నారు. అనుభవం ఉన్నవారితో డిజైన్లు తయారు చేయించాలన్నారు.
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు… pic.twitter.com/HDKAgT6Uhh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025