E-Paper
Advertisement

Ram Charan : ప్రియాంక చోప్రా ఈవెంట్‌కు స‌తీమ‌ణి ఉపాస‌నతో క‌ల‌సి సంద‌డి చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

Ram Charan : ప్రియాంక చోప్రా ఈవెంట్‌కు స‌తీమ‌ణి ఉపాస‌నతో క‌ల‌సి సంద‌డి చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్
Advertisement
Ram Charan

Ram Charan : ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ ప్ర‌త్యేకంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని పార‌మౌంట్ పిక్చ‌ర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక‌ చోప్రా (మ‌లాల యూస‌ఫ్ జైతో క‌లిసి) హోస్ట్ చేసిన ప్ర‌త్యేక‌మైన కార్యక్ర‌మంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నారు.

దక్షిణాసియాకి చెందిన చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చింది పారామౌంట్ సంస్థ. ఈ కార్య‌క్ర‌మంలో ద‌క్షిణాసియాకు చెందిన నటులు, నిపుణులు, ఆస్కార్ నామినీస్‌, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు.

Advertisement

రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆయన స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌ కూడా ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంకు ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు,” అని తెలిపారు. తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి ఉన్న ఫొటోల‌ను ఆమె షేర్ చేసుకున్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూస్‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ పార్టీకి స‌మ‌యాన్ని కేటాయించి హాజ‌ర‌య్యారు. అంజుల ఆచార్య‌, మిండి కలింగ్‌, కుమైల్ నంజైని, క‌ల్ పెన్‌, అజీజ్ అన్సారీ, బెలా బ‌జ్రియా, రాధికా జోన్స్‌, జోసెఫ్ ప‌టేల్‌, శ్రుతీ గంగూలీ, అనితా ఛ‌ట‌ర్జీ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

రామ్ చరణ్‌కి బాలీవుడ్ ఎంట్రీ కొత్తేమీ కాదు. గతంలో తుఫాన్ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. ఆ మూవీలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగా తనయుడు ఆర్ఆర్ఆర్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

FOR MORE UPDATES PLEASE FOLLOW : Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×