E-Paper
Advertisement

Smart Hospital : ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ హాస్పిటల్ ఏర్పాటుకు సన్నాహాలు..

Smart Hospital : ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ హాస్పిటల్ ఏర్పాటుకు సన్నాహాలు..
Advertisement
Smart Hospital

Smart Hospital : సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందినా కూడా అది ప్రజల వరకు చేరడానికి కొంచెం సమయం పడుతుంది. అలా కాకుండా మెరుగుపడుతున్న టెక్నాలజీలను ఎప్పటికప్పుడు వినియోగించుకునే రంగం హెల్త్ కేర్. కేవలం వైద్యరంగం కోసమే పరిశోధనలు చేస్తూ.. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కోసమే కొందరు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. తాజాగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కోసం హువేయ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

హెల్త్ కేర్ సెక్టార్‌లో డిజిటల్ టెక్నాలజీని మెరుగుపరచడం వల్ల ప్రజలకు ఎన్నో లాభాలు సమకూరుతాయి. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. తాజాగా హువేయ్ హెల్త్ కేర్‌కు సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో హెల్త్ కేర్‌లో డిజిటల్ జర్నీ వేగం పెంచాలనే అంశంపై చర్చలు జరిగాయి. ఆపై నాలుగు హెల్త్‌కేర్ సొల్యూషన్స్‌తో పాటు ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ హాస్పిటల్‌ను కట్టాలని నిర్ణయించుకుంటున్నట్టు హువేయ్ ప్రకటించింది.

Advertisement

ఈ స్మార్ట్ హాస్పిటల్ ద్వారా కేవలం చైనాలో మాత్రమే కాకుండా చైనా బయట ఉన్న పేషెంట్లకు కూడా ఎప్పటికప్పుడు వైద్యం అందేలా చూడాలని హువేయ్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం హెల్త్ కేర్‌లో టెక్నాలజీ అనేది ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. 5జీ, ఎఫ్5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీలు హెల్త్ కేర్‌తో చేరి డెవలప్‌మెంట్‌లో భాగమవుతున్నాయి. అందుకే హువేయ్ కూడా నిపుణులతో కలిసి హెల్త్ కేర్ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సన్నాహాలు చేయాలనుకుంటోంది.

స్మార్ట్ హాస్పిటల్‌తో పాటు హువేయ్ ప్రవేశపెట్టనున్న హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఏంటంటే.. ఆప్టికల్ విభాగంలో 3డి ఇమేజ్, డిజిటల్ పాథాలజీ, స్మార్ట్ వార్డ్ సొల్యూషన్, వైర్‌లెస్ట్ వార్డ్ మేనేజ్మెంట్. ఆప్టికల్ ఇమేజింగ్ ద్వారా క్షణాల్లోనే 4కే క్వాలిటీతో 3డి ఇమేజ్‌ను పొంది సమస్యను కనుక్కోవచ్చు. హెల్త్ కేర్‌లో ఐఓటీ అప్లికేషన్స్‌ను ప్రారంభించడం ద్వారా పేషెంట్స్‌ను ఎప్పుడూ కనిపెడుతూ ఉండే అవకాశం లభిస్తుంది. ఇక స్మార్ట్ హాస్పిటల్ ఐడియా ద్వారా 24 గంటలు డాక్టర్లు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా హువేయ్ ప్రయత్నిస్తానంటోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×