Sankranthiki Vasthunam : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించిన ఈ సినిమా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రిలీజై ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరే అప్డేట్ వచ్చేసింది. ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ అంటూ సాగే పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం ఈ పాట ఫుల్ వీడియోను విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పటివరకు రూ. 300 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. మెుదటి సారి రూ.200 కోట్లు దాటి వసూళ్లు సాధించింది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంగీతమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా గోదారి గట్టుమీద రామచిలకవే అంటూ సాకే సాంగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అంతలా సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ పాట సినిమా సక్సెస్ లో స్పెషల్ పార్ట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ, ఐశ్వర్య రొమాన్స్ మెలోడీ అద్భుతంగా ఉంది.
ఇక ఈ సాంగ్ మెలోడీకి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియా స్వరాలు సమకూర్చారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ కలిసి రమణా గోగుల ఈ పాట పై తనదైన ముద్ర వేశారు.
ALSO READ : ఏం చేయలేకపోయాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను.. సల్మాన్ ఖాన్ ఆవేదన