Bengaluru Metro Rail: గత కొంత కాలంగా బెంగళూరు మెట్రో(Bengaluru Metro) ధరలు పెరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం(Central Government) ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా మెట్రో టికెట్ ధరలు(Metro Ticket Price) పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైలు యాజమాన్యం ప్రకటించింది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) టికెట్ ధరలను సవరిస్తున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలను ఇవాళ్టి(ఆదివారం) నుంచే అమలు చేయనున్నట్లు తెలిపింది. ధరల పెంపు మాత్రమే కాదు, ఉబర్, ఓలా తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్(Peak Off Peak Hours) విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
గరిష్ఠ ధర రూ. 60 నుంచి రూ. 90కి పెంపు
ఇక బెంగళూరు మెట్రోకు సంబంధించి గరిష్ఠ ధర రూ. 60 ఉండగా, సవరించిన ధరల ప్రకారం ఇకపై గరిష్ఠ ధర రూ. 90కి చేరనుంది. కనీస ఛార్జ్ రూ. 10 గానే ఉంచింది. నిజానికి ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ధర సవరింపులను సూచిస్తూ రీసెంట్ గా నివేదికను సమర్పించింది. BMRCL బోర్డు ఆమోదం పొందిన నేపథ్యంలో టికెట్ ధరలు ఫిబ్రవరి 9 నుంచి అమలు కాననున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను(BUS Ticket Rates) 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మెట్రో ఛార్జీలను కూడా పెంచడంతో బెంగళూరు వాసులకు ప్రయాణ వ్యయం మరింత పెరగనుంది.
కొత్తగా పీక్ అవర్ టారిఫ్ సిస్టమ్ అమలు
ఇక బెంగళూరు మెట్రో రైలు పరిధిలో కొత్తగా పీక్ అవర్ టారిఫ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. ఈ విధానం ప్రకారం మార్నింగ్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి 8 గంటల వరకు.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మళ్లీ రాత్రి 9 గంటల నుంచి చివరి వరకు ఆఫ్ వరకు పీక్ అవర్స్ గా నిర్ణయించారు. అంటే మిగతా సమయాన్ని కూడా పీక్ అవర్స్ గా భావిస్తారు. స్మార్ట్ కార్డులపై పీక్ అవర్స్ సమయంలో 10 శాతం, ఆఫ్ పీక్ అవర్స్ లో 5 శాతం డిస్కౌంట్ అందిస్తారు.
బెంగళూరు సెంట్రల్ ఎంపీ అలా.. మెట్రో యాజమాన్యం ఇలా!
వాస్తవానికి మెట్రో రైళ్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం హోల్డ్ లో పెట్టిందని గత నెలలో బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. “ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన మెట్రో ఛార్జీలను హోల్డ్ లో పెట్టారు. ఛార్జీల సవరణకు సంబంధంచి కంప్లీట్ రిపోర్టు ఇవ్వాలని మోడీ సర్కారు ఆదేశించింది” అని రాసుకొచ్చారు. అయితే, ఈ ట్వీట్ పై రీసెంట్ గా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్(DK Shiva Kumar) స్పందించారు. టికెట్ల పెంపు నిర్ణయంలో తమ జోక్యం లేదని వెల్లడించారు. అయితే, ఇప్పటికే బస్సు ఛార్జీలు, ఇప్పుడు మెట్రో ఛార్జీలు పెంచడం పట్ల బెంగళూరు వాసులు(Bengaluru People) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!