Golden Sparrow: సోషల్ మీడియా వచ్చాక ఏ భాషలో అయినా ఒక సాంగ్ కానీ, ఒక సీన్ కానీ, ఒక రీల్ కానీ హిట్ అయ్యిందంటే చాలు.. ఇన్ఫ్లుయెన్సెర్స్ దాన్ని ఎంత ఫేమస్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గతేడాది సోషల్ మీడియాలో బాగా హిట్ అయిన సాంగ్స్ లో బాగా వైరల్ గా మారిన సాంగ్ ఏది అంటే టక్కున గోల్డెన్ స్పారో అని చెప్పకొచ్చేస్తారు. సాంగ్ ఏదైనా కానీ వైరల్ అయితే సోషల్ మీడియాలో అవే వీడియోస్ చేస్తూ నెటిజన్స్ పిచ్చెక్కిస్తుంటారు.
ఇక కొన్ని నెలల క్రితం నుంచి గోల్డెన్ స్పారో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో 142 మిలియన్ పైగా వ్యూస్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ వైరల్ సాంగ్ తెలుగులో కూడా వచ్చేసింది. అసలు ఈ సాంగ్ ఏ సినిమాలోది..? హీరో ఎవరు.. ? డైరెక్టర్ ఎవరు.. ? అని చాలామంది గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గోల్డెన్ స్పారో సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Chandoo Mondeti: రక్తపు వాంతులు.. చేతులతో చేపల కూర వడ్డిస్తే చైతన్య ఏం చేశాడంటే.. ?
ఇక ఈ సినిమాను తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అందాల భామ ప్రియాంక మోహన్ డాన్స్ తో అదరగొట్టింది. ఈ సాంగ్ కు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా.. అశ్విన్ సత్య, సుధీష్ శశి కుమార్, సుబ్లాషిని , అరువి తదితరులు ఆలపించారు. జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
మొదటినుంచి ధనుష్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్పై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇక డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా ధనుష్ వరస సినిమాలతో బిజీగా మారాడు. తెలుగులో ఆయన నటిస్తున్న కుబేర సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ధనుష్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.