భారతీయ రైల్వే దేశానికి జీవనాడిగా కొనసాగుతున్నది. నిత్యం లక్షలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే, ఆయా రైళ్లలో విలాసవంతమైన ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్లీపర్ కోచ్‌ల వరకు పలు రకాల క్లాసుల ప్రయణాన్ని అందిస్తున్నాయి. ఇంతకీ రైళ్లలో ఎన్ని క్లాసులు ఉంటాయంటే..
⦿ AC ఫస్ట్ క్లాస్ (1A): లగ్జరీ రైలు ప్రయాణం చేయాలి అనుకునే వాళ్లు AC ఫస్ట్ క్లాస్(1A)ను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కోచ్ లు పూర్తి ఏసీతో ఉంటాయి. డోర్ లాక్‌లు, పర్సనల్ వాష్ బేసిన్లు, షవర్ సౌకర్యాలతో పాటు విశాలమైన కంపార్ట్ మెంట్లను కలిగి ఉంటాయి. ప్రయాణీకులకు బెడ్ షీట్లు, దిండ్లు, దుప్పట్లు, తువ్వాళ్లను అందిస్తారు. రైలు, రూట్ ను బట్టి టికెట్ ధర రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు ఉంటుంది.
⦿ AC సెకండ్ క్లాస్(2A): 2A అనేది 1A కంటే కాస్త తక్కువ సౌకర్యాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ క్లాస్ లోనూ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణీకులు మధ్య బెర్తులు లేకుండా ప్రైవేట్ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి కర్టెన్డ్ బెర్త్ లు ఉంటాయి. ప్రయాణీకులకు బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండ్లు అందిస్తారు. టికెట్ ధరలు ధరలు రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ఉంటాయి.
⦿ AC 3-టైర్(3A): AC 3-టైర్ క్లాస్ మధ్యతరగతి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో కూడా ఎయిర్ కండిషన్డ్ కోచ్ లు ఉంటాయి. ప్రతి కోచ్ లో, ఎనిమిది బెర్త్ లు ఉంటాయి. మూడు సైడ్ బెర్త్ లు, ఒక మిడిల్ బెర్త్. బెడ్ షీట్లు, దిండ్లు,దుప్పట్లు అందిస్తారు. టికెట్ ధర రూ. 500 నుండి రూ. 1,500 వరకు ఉంటుంది.
⦿ AC 3-టైర్ ఎకానమీ(3E): AC 3-టైర్ ఎకానమీ అనేది 3A అప్ గ్రేడ్ వెర్షన్. ఈ తరగతిలో ఒకే కంపార్ట్ మెంట్ లో తొమ్మిది బెర్తులు, డిజైన్ చేయబడిన సీట్లు ఉంటాయి. ప్రతి సీటు దగ్గర ఫోల్డబుల్ మీల్ టేబుల్స్, USB ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. AC 3 టైర్ తో పోల్చి ధర కాస్త తక్కవగా ఉంటుంది.
⦿ స్లీపర్ క్లాస్ (SL): స్లీపర్ క్లాస్ అత్యంత సరసమైన జర్నీ ఆప్షన్. ఇది సాధారణంగా కోచ్ కు 72-80 బెర్తులను కలిగి ఉంటుంది. ఎయిర్ కండిషనింగ్ ఉండదు. తక్కువ దూరం ప్రయాణించడానికి, తక్కువ ఖర్చు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
⦿ AC చైర్ కార్ (CC): ఇది చిన్న ప్రయాణాలకు ఉత్తమమైనది. దీనిని శతాబ్ది, దురంతో, గరీబ్ రథ్ రైళ్లలో ఈ క్లాస్ ఉంటుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ తో ఉంటుంది. వరుసగా ఐదు సీట్లను కలిగి ఉంటుంది. కొన్ని గంటలు మాత్రమే ప్రయాణించాల్సిన వ్యక్తులకు ఇది అనుకూలమైన ఆప్షన్.
⦿ ఎక్స్ క్లూజివ్ క్లాస్ (EC): ఇది విశాలమైన, ఎయిర్ కండిషన్డ్ సీటింగ్ తో లగ్జరీ బిజినెస్-క్లాస్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ క్లాస్ అనేది శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లలో కనిపిస్తుంది. AC ఫస్ట్ క్లాస్ మాదిరిగానే సౌకర్యాలను అందిస్తుంది. కానీ చైర్ స్టైల్ సీటింగ్ తో ఉంటుంది.
⦿ ప్రీమియం క్లాసులు: రాజధాని, శతాబ్ది, దురంతోలో ఈ క్లాసులు ఉంటాయి.
రాజధాని ఎక్స్ ప్రెస్: AC 2-టైర్, AC 3-టైర్ క్లాసులను అందిస్తుంది. టికెట్ ధరలోనే భోజనం అందిస్తారు.
శతాబ్ది ఎక్స్ ప్రెస్: AC చైర్ కార్ (CC), ఎక్స్ క్లూజివ్ క్లాస్ (EC)ను కలిగి ఉంటుంది.
దురంతో ఎక్స్ ప్రెస్: AC 2-టైర్, AC 3-టైర్ సౌకర్యాలను అందిస్తుంది. ఇది నాన్-స్టాప్ లాంగ్ డిస్టెన్స్ రైలు. ఇందులో క్యాటరింగ్ సేవలు కూడా ఉంటాయి.
⦿ జనరల్ క్లాస్: ఇది రైలులో చౌకైన వసతి. సాధారణ సీట్లు ఉంటాయి.ఈ కోచ్ లు రద్దీగా ఉంటాయి. సీటుకు గ్యారెంటీ ఉండదు. టికెట్ ను కొనుగోలు చేసిన 24 గంటల్లోపు అదే రూట్‌లోని ఏ రైలులోనైనాచెల్లుబాటు అవుతాయి.
Read Also: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?