E-Paper
Advertisement

NTPC Recruitment 2025: బీటెక్ అర్హతతతో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం.. పూర్తి వివరాలివే..

NTPC Recruitment 2025: బీటెక్ అర్హతతతో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం.. పూర్తి వివరాలివే..
Advertisement

NTPC Recruitment 2025: బీటెక్, గేట్ స్కోర్ ఉన్న వారికి ఇది సూపర్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎన్టీపీసీ లిమిటెడ్.. ఫిక్స్ డ్ టర్మ్ ప్రతిపాదికన గేట్-2024 స్కోర్ ద్వారా పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది.  మరి అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.  ఫిబ్రవరి 3 వ తేదీని దరఖాస్తు గడువు ముగియనుంది.

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన గేట్-2024 స్కోర్ ద్వారా 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 475

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విభాగాల వారిగా ఖాళీలు:

ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

1. ఎలక్ట్రానిక్స్‌- 135
2. మెకానికల్‌- 180
3. ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- 85
4. సివిల్‌- 50
5. మైనింగ్‌- 25

విద్యార్హత: ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ, ఏఎంఐఈలో 65 శాతం మార్కులతో గుర్తింపు పొంది యూనివర్సిటీ/ ఇన్ స్టిట్యూట్ నుంచి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. (ఇది ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది). 2024 గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చివరి తేది నాటికి 27 ఏళ్ల మించరాదు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, షార్ట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 13 తేదిలోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్‌కు ఎలాంటి సందేహం ఉన్నా అఫీషయల్ వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ntpc.co.in/jobs-ntpc

బీటెక్, గేట్ స్కోర్ అర్హతలున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దరఖాస్తు గడువు కూడా దగ్గర పడుతోంది. వెంటనే అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇందులో కనుక ఉద్యోగానికి సెలెక్ట్ అయితే భారీ వేతనం కల్పిస్తారు. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం కల్పిస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: Indian Post Recruitment-2025: జస్ట్ టెన్త్ పాసైతే చాలు.. పోస్టల్ శాఖలో జాబ్.. పూర్తి వివరాలివే..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 475

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 13

దరఖాస్తు ఫీజు: రూ.300

జీతం: రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×