Goparaju Vijay : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నారు. వాళ్లలో గోపరాజు రమణ ఒకరు. గోపరాజు రమణ తెలుగు నాటక రంగంలోనూ టీవీలలోనూ నటించి ఉత్తమ నటుడిగా చాలా అవార్డులు అందుకున్నారు. ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సాధించారు . ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో చాలామంది దృష్టి గోపరాజు రమణ పై పడింది. ముఖ్యంగా తండ్రి పాత్రలో తను నటించిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మా ఇంట్లో కూడా ఇటువంటి ఫాదర్ ఏ ఉన్నాడు అని చాలామంది రిలేట్ అయ్యారు.
రమణ 10వ తరగతిలో ఉన్నప్పుడు మానవుడి అడుగుజాడల్లో అనే నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1967లో బాలానందం అనే నాటక సంస్థలో చేరాడు. నాటకరంగంలో నటుడిగా రమణకి మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా పలు సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ నటించాడు. 2005లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన గ్రహణం సినిమాలో రమణ తొలిసారిగా నటించాడు. ఈ తరువాత మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, అష్టాచెమ్మా వంటి సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ గురువుగా నటించాడు రవీంద్రభారతిలో జరిగిన నాటక ప్రదర్శనలో రమణ నటన చేసిన దర్శకుడు వినోద్ అనంతోజు, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలోని ‘కొండల్రావ్’ పాత్రకి ఎంపిక చేశాడు.
Also Read : Grammy Awards 2025 : కంప్లీట్ గ్రామీ అవార్డ్స్ లిస్ట్… చరిత్ర సృష్టించిన బియోన్స్, చంద్రిక
ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో గోపరాజు రమణ ప్రముఖ పాత్రలలో కనిపించారు. అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమాలో తన పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఆ పాత్ర కామెడీని పండించిన విధానం కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తుండిపోయే పాత్రలు చేశారు రమణ. గోపరాజు రమణా నటించిన సినిమాల్లో, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్ళు, జనక అయితే గనక, స్వాగ్ వంటి సినిమాలు మంచి గుర్తింపును సాధించాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2024లో గోపరాజు రమణ కి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తరుణంలో గోపరాజు రమణా నటించిన దాదాపు 5 సినిమాలకు తన కొడుకు గోపరాజు విజయ్ డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. డబ్బింగ్ చెప్పిన ఐదు సినిమాలలో స్వాగ్ మరియు కమిటీ కుర్రాళ్ళు సినిమాలు కూడా ఉన్నాయి. గోపరాజు విజయ్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ప్రెసిడెంట్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.సంక్రాంతికి వస్తున్నాను సినిమా తర్వాత గోపరాజు విజయ్ కి కూడా వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read : Raj Tarun Controversy : హార్డ్ డిస్క్‌లో 300ల న్యూ*డ్ వీడియోలు… మస్తాన్ సాయి బండారాన్ని బయట పెట్టిన లావణ్య