Sonu Sood: సేవా కార్యక్రమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అతడు. కరుణ కాలంలో అతను అందించిన సేవలు అనిర్వచనీయం. ఎందరో విదేశాలలో ఉన్న భారతీయులు కరుణ కాలంలో స్వదేశానికి చేరారంటే.. అందులో ఈ నటుడి పాత్ర ఎంతో కీలకమనే చెప్పవచ్చు. సినిమాలలో మాత్రం విలన్ క్యారెక్టర్ పోషించే ఈ నటుడి మనసు వెన్న అంటారు ప్రేక్షకులు. అంతేకాదు సేవా కా బాప్ అంటారు అతడి అభిమానులు. ఇప్పటికే అర్థమైందా.. ఆ నటుడు ఎవరో.. ఔను మీరు అనుకున్నది నిజమే. ఆ నటుడే సోనూ సూద్. తాజాగా మరోమారు తన సేవా దృక్పథాన్ని చాటి, మరోమారు వార్తలు నిలిచారు సోనూ సూద్.
విలక్షణమైన పాత్రలలో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న సోనూ సూద్ సేవా కార్యక్రమాలలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తనకోసం తన ఇంటి గడప తొక్కిన ప్రతి అభిమాని కంటనీరు తుడిచిన నటుడిగా సోనూ సూద్ కు సేవా తత్పరుడు అంటూ అభిమానులు కొనియాడుతూ ఉంటారు. రక్తదాన శిబిరాలు, పేద ప్రజలకు దానాలు, రోగులకు అవసరమైన మందుల పంపిణీ , ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలను సోనూ సూద్ నిర్వహించారు.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును సోనూ సూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కండోమ్ మెజారిటీ సాధించిన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సోనూ సూద్.. తన ఫౌండేషన్ ద్వారా రాష్ట్రానికి సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చంద్రబాబుతో చెప్పారు. ప్రభుత్వానికి అంబులెన్స్ లను ఫౌండేషన్ ద్వారా అప్పగించి, పేద ప్రజలకు సేవలు అందించాలని సోనూ సూద్ తన మనోగతం సీఎం వద్ద బయటపెట్టారు.
Also Read: APSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఇదైతే తప్పక తెలుసుకోండి!
దీనితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సోనూ సూద్ ను అభినందించారు. అయితే ఫౌండేషన్ ద్వారా ఎన్ని అంబులెన్స్ లను రాష్ట్రానికి అందిస్తున్నారన్నది పూర్తిగా తెలియాల్సి ఉంది. నటుడి గానే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా తనకంటూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న సోనూ సూద్ నేటి యువతకు ఆదర్శప్రాయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏదిఏమైనా కరోనా కాలంలో తన సేవలు విస్తరించిన సోనూ సూద్ ఇంకా అదే సేవా దృక్పథాన్ని చాటుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీకి అంబులెన్స్ లను అందించేందుకు ముందుకు వచ్చిన తమ నటుడికి తెలుగు అభిమానులు జేజేలు పలుకుతున్నారు.