SSMB29 Movie Villain : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై రోజు రోజుకు హైప్ పెరుగిపోతుంది. మూవీ షూటీంగ్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసి కొంత భాగాన్ని చిత్రీకరించారు. మార్కెట్ కోసం బాలీవుడు స్టార్స్ ను దింపుతూ హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తీస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటేనే ఆరునెళ్ల ఆలస్యమని కొత్తగా చెప్పాల్సిన మాట కాదు. జమానా నుంచి నడుస్తున్న ట్రెండే..
ఇక అప్ డేట్స్ లేక విలవిలలాడుతున్న ఫ్యాన్స్ కు ఓ అద్బుతమైన వార్త చక్కర్లు కొడుతుంది. హీరో హీరోయిన్ ఓకే మరి విలన్ ఎవరా అని అంతా అనుకుంటున్నా టైం లో సినిమాలో ఓ వార్త వైరల్ గా మారింద. మూవీ మార్కెట్ ను మరింత పెంచేందుకు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకొచ్చాడనే రూమర్లు వస్తున్నాయి.ఈ చిత్రంలో మహేష్ బాబుకి అపోజిట్‌గా ఓ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా పథ్వీమారన్ కనిపించనున్నాడట. కానీ దీనిపై ఇంత వరకు జక్కన్న టీం క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఇలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే.. కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయని తెలిసింది. కొన్ని రోజులుగా అల్యూమినియం ఫ్యాక్టరీలో జక్కన్న షూటింగ్ చేస్తూనే వచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అక్కడే చేస్తూ వచ్చాడు. ఓ పెద్ద కాశీ సెట్ వేశాడన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మకాం మార్చాడు. ఒడిశాకు వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. అక్కడ తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చిత్ర యూనిట్ ఫోటోస్ సోషల్ మీడియాలోకి వచ్చాయి.
ఎయిర్ పోర్టులో ఉన్న మహేశ్, పృథ్వీ రాజ్ ఫోటోలు బయటపడ్డాయి. మహేష్ బాబు లుక్ కూడా కాస్త లీక్ అయింది. పైగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చిత్రంలో ఉన్నాడని అందరికీ అర్థమైంది. అలా రాజమౌళి ఎంతో భద్రంగా దాచుకున్న అప్డేట్లు ఇలా అన్నీ బయటకు వచ్చేశాయి. మరి జక్కన్న వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరగా ఏమైనా ఇస్తాడేమో చూడాలి.మూవీ రిలీజ్ కావడానికి మినిమం మూడేళ్లు పడుతుందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం జక్కన్న అయితే తన సినిమా షూటింగ్ మీదే ఫోకస్డ్‌గా ఉన్నాడు. మరి ఇకనైన రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో వేచి చూడాలి.