Korowai Tribe Indonesia : ఆధునిక సమాజానికి దూరంగా, అడవుల్లో జీవిస్తూ.. బాహ్య ప్రపంచం గురించి తెలియని అనేక జాతులు ఇంకా భూమి మీద జీవిస్తున్నాయి. వారు ఇప్పటికీ.. వేల ఏళ్లనాటి సంప్రదాయాల్ని, జీవన విధానాన్ని గడుపుతుంటారు. అలాంటి ఓ వింతైన, మనకు ఆశ్చర్యపరిచే ఓ ఆదిమ జాతి గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని మీకుందా.? అయితే.. ఇండోనేషియాలోని అడవుల్లో ఉండే.. ఈ కొరోవాయి తెగ గురించి ఈ ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వారి జీవన పోరాటాలు, జీవన విధానాలు.. మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
ఇండోనేషియాలోని అడవుల్లో ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతులు జీవిస్తున్నాయి. వారికి జీవనమో ఓ పోరాటం. అడుగు అడుగు వారి పూర్వికులు అందించిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ జీవించడమే. అంతే తప్పా.. వారుంటున్న అడవికి బయట మరో ప్రపంచం ఉందని, అందులో ఆధునిక మనుషులున్నారని, వారి జీవితం గురించి కానీ.. ఎలాంటి పరిజ్ఞానం లేదు. వాళ్లల్లో ఓ తెగ గురించి.. కొద్దికాలం క్రితమే సాధారణ మనుషులు తెలుసుకున్నారు. వారిలో.. ఒకరే కొరోవాయి ఆదిమ జాతి ప్రజలు.
నరమాంసం తింటారు
ప్రస్తుతం వీరి సంఖ్య 3 వేలకు లోపే ఉంది. 1970లో అనుకోకుండా.. ఆ ప్రాంతానికి వెళ్లిన ఓ సినిమా ఫోటోగ్రాఫర్ కారణంగా ఈ విషయం వెల్లడైంది. అప్పటి వరకు వారికి కనీసం మనుషుల గురించిన ఎలాంటి అవగాహన లేదు. అప్పటి నుంచే వారికి కొద్దికొద్దిగా.. ఆధునిక మానవులు దగ్గర అయ్యారని చెబుతారు. అంతకు ముందు ఈ జాతి ప్రజలు.. నరమాంస భక్షకులు అంట. ఎవరైనా భయటి నుంచి వస్తే.. రాక్షస మనుషులు అని భావిస్తుంటారు. వాళ్లు పిల్లల్ని ఎత్తుకు వెళ్లేందుకు వస్తున్నారని, వారిని బానిసలుగా తీసుకెళ్లేందుకు వస్తున్న ప్రత్యర్థి జాతుల వారిగా భావించి.. చంపి తినే వాళ్లంటా. మనుషుల మాంసాన్ని తినే అతికొద్ది మంది ఆదిమ జాతుల్లో కొరోవాయి తెగ ఒకటి. అయితే.. ప్రస్తుతం వీరి జీవన శైలి మారిందని, కొద్దికొద్దిగా.. ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చి, సాధారణ మనుషులతో కలుస్తున్నారని చెబుతున్నారు.
చెట్లపైనే వీరి నివాసం
పాపువా ప్రాంతంలోని సాంద్రమైన అడవుల్లో, కొరోవాయి తెగ శతాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. వీరి జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా ఎవరైనా భూమి మీదే గుడిసెలు వేసుకుని, మట్టి గోడల్ని నిర్మించుకుని జీవిస్తుంటారు. కానీ.. ఈ జాతి ప్రజలు మాత్రం.. నేల మీద జీవించరు. వీరు భూమి నుంచి 100 అడుగుల ఎత్తైన చెట్లపై ఇళ్లను నిర్మించుకుని జీవిస్తుంటారు. లేదంటే.. అంత పొడవైన కర్రలపై ఇళ్లను నిర్మించుకుంటుంటారు. ఈ జాతి ప్రజల జీవన శైలిలో ఇదో భిన్నమైన అంశం. అయితే.. ఆసక్తికరంగా.. చెట్లపైన కర్రలు, ఆకులతో నిర్మించిన నిర్మాణాల్లోనూ ఆగ్నిని వాడుతుంటారు. చెట్లపై ఇంటిని నిర్మించడం సామూహిక కార్యంగా.. అందరూ కలిసి చేస్తుంటారు.
వీరు అలా ఎందుకు చేస్తారనేందుకు చాలా కారణాలున్నాయంటారు.. పరిశోధకులు. ముఖ్యంగా.. అటవుల్లోని జంతువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఎత్తైన ప్రాంతాలపై నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. అలాగే.. అడవుల్లో సంభవించే వరదల్లో ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఇలా చేస్తుంటారు. మరో ముఖ్యమైన కారణం అంటే.. అడవుల్లోని ప్రత్యర్థి తెగలు.. వీరి నివాసాలపై దాడులు చేసి, పిల్లల్ని బానిసలుగా ఎత్తుకుపోతారంట. మరికొన్ని సందర్భాల్లో వారితో తలపడాల్సి వస్తుంటుంది. అందుకే.. ముందు జాగ్రత్తగా ఇలా ఎత్తైన ఇళ్లల్లో ఉండడం వారికి తరాలుగా వస్తున్న జీవనశైలి.
పురాణాలు, పునర్జన్మపై గట్టి నమ్మకం
ఈ ఆదిమ జాతి ప్రజలకు వారి పూర్వీకులు అందించిన జీవన నైపుణ్యాలు అనుసరించడం ఆనవాయితీ. అలాగే.. వీరికి పురాణాలు, జానపద కథలపై గట్టి నమ్మకం. వాళ్లు.. అదృశ్య మంత్రాలని ఇప్పటీ నమ్ముతుంటారు. వారి పూర్వికులు ఎప్పటికైనా తిరిగి భూమి మీదకు వస్తారని విశ్వసిస్తుంటారు. పునర్జన్మ మీద ఈ తెగ ప్రజలకు నమ్మకం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే.. వీళ్లల్లో ఎవరైనా ఆధునిక మానవుల్ని చూస్తే భయపడిపోతుంటారు. వాళ్లు దెయ్యాలని, రాక్షసులు అని భావించి, తీవ్రంగా భయపడిపోతుంటారు. ఇలా వీరి జీవన పోరాటంలో భాగంగా.. శత్రు జాతుల మధ్య వచ్చే పోరాటాలు, తగాదాలతో పాటు.. మంత్రగత్తెలు, రాక్షసులు అని భావించిన వారిని వేటాడి చంపి తినేస్తుంటారు చెబుతుంటారు.
వేట, ఆహారం సంపాదించడమే వీరి దైనందిన జీవితం. కొరోవాయి తెగ సభ్యులు అడవుల్లో లభించే ప్రకృతిసిద్ధ ఆహారాన్ని భోజనంగా తీసుకుంటారు. వీరి ఆహారంలో ముఖ్యంగా సాగో చెట్టు, చెట్ల కాండం నుంచి గుజ్జు ఉంటుంది. అలాగే.. చేపలు, వేటాడిన చిన్న జంతువులు ఉంటుంటాయి. వీటిని చేతితో తయారు చేసిన ఉచ్చులతో పట్టుకుంటారు. అలాగే.. పురుగులు, లార్వాను ఆహారంగా తీసుకుంటారు. అడవిలో లభించే కాయలు, పండ్లు, సహజ వనరుల నుంచి పోషకాహారం పొందుతారు. పురుషులు ప్రధానంగా వేట చేస్తారు, మహిళలు ఆహారం సేకరించి పిల్లలను సంరక్షిస్తారు. వీరు విల్లు, బాణాలు ఉపయోగించి వేట చేస్తారు. అలాగే, వీరికి వైద్యంలో ఉపయోగించే మొక్కల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉందని పరిశోధకుల గుర్తించారు.
Also Read : Trump Tariff India: భారత్ పై ట్రంప్ సుంకాల ప్రభావం.. జైశంకర్ ఏమన్నారంటే..