E-Paper
Advertisement

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..
Advertisement

Viswam: మ్యాచో స్టార్  గోపీచంద్,  కావ్య థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వం. గత కొన్నేళ్లుగా గోపీచంద్ హిట్ అందుకున్నది లేదు.. గత కొన్నేళ్లుగా శ్రీను వైట్ల ఇండస్ట్రీలో కనిపించి లేదు.. ఇక కెరీర్ మొదలైనప్పటి నుంచి కావ్య ఒక్క హిట్ అందుకున్నది లేదు..  ఈ ముగ్గురు ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నారు. శ్రీను వైట్ల  కామెడీ మార్క్.. ఈ సినిమాలో ఫుల్ గా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు.

ఇప్పటికే విశ్వం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా అక్టోబర్ 11 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసింది. ఇప్పటికే ఒకపక్క గోపిచంద్.. ఇంకోపక్క శ్రీను వైట్ల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.  ఇక మేకర్స్ సైతం సినిమాలోని సాంగ్ ను రిలీజ్ చేస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నారు.

Advertisement

తాజాగా విశ్వం సినిమా  నుంచి ఒక మాస్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గుంగురు గుంగురు అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు సురేష్ గంగుల లిరిక్స్ అందించాడు. ఇక ఈ ఊర మాస్ సాంగ్ ను భీమ్స్ సిసిరోలియో, మాయిపిలో రోహిణి సోరట్ తమ హస్కీ వాయిస్ తో ఆలపించి మరో లెవల్ కు తీసుకెళ్లారు. మంచి ఊర మాస్ సాంగ్ లో గోపీచంద్ స్టెప్స్ అదరగొట్టాడు.

సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే.. కావ్య థాపర్ అందాలు మరో ఎత్తు. అమ్మడి అందాలకు ఫిదా కానీ ఫ్యాన్స్ అయితే ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈ సాంగ్ కు థియేటర్ లో డ్యాన్స్ లు ఖాయమని చెప్పొచ్చు. మరి విశ్వం సినిమా .. ఈ ముగ్గురికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×