E-Paper
Advertisement

Guntur Kaaram: గుంటూరు కారం మెయిన్ పాయింట్ అదేనట.. లీకైన ఇన్ సైడ్ స్టోరీ..

Guntur Kaaram: గుంటూరు కారం మెయిన్ పాయింట్ అదేనట.. లీకైన ఇన్ సైడ్ స్టోరీ..
Advertisement

Guntur Kaaram: టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మూవీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి క్రేజ్ ఉన్న నటుడు మహేష్. విభిన్నమైన పాత్రలతో, వినూత్నమైన కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్నాడు ఈ యాక్టర్. రేపు సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో బరిలోకి దిగుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. అందుకే ఈ మూవీ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులలో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ఇన్సైడ్ స్టోరీ లీక్ అయింది.శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

13 సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు మూవీ మహేష్ బాబు కెరీర్ లోని ఒక మైలురాయి. ఖలేజా అంతగా ఆకట్టుకోలేకపోయినా కామెడీ పరంగా డైలాగ్స్ పరంగా ఆ మూవీ లెవెల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న గుంటూరు కారం ఏ లెవెల్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి నెల చివరికి షూటింగ్ పూర్తి కాబోతోంది అని టాక్. అలాగే జనవరి 6న ఒక భారీ ఈవెంట్ నిర్వహించి అప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఫ్యాన్స్ ని అలరించే అంశాలకు కొదవ లేదట.. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ హైలెట్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది.

Advertisement

అంతేకాదు మహేష్ బాబు తన కెరీర్ లో మొదటిసారి ఎక్కువ ఎమోషనల్ సీన్స్ ఈ మూవీలో చేయబోతున్నారని టాక్. అలాగే ఇందులో ఉన్న మాస్ ఫైట్స్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయట. ఈ మూవీలో ఒక రీమిక్స్ సాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట ఎవరిది ?ఎందుకు? అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం మూవీ నుంచి లీకైన ఈ కంటెంట్ కరెక్టో కాదో తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే ఇక ఈ మూవీ మహేష్ అభిమానులకు మంచి మాస్ ట్రీట్ అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×