BigTV English

Megastar Movie: మెగాస్టార్ మూవీకి నో చెప్పిన శైలేష్ కొలను.. కారణం అదేనట..

Megastar Movie: మెగాస్టార్ మూవీకి నో చెప్పిన శైలేష్ కొలను.. కారణం అదేనట..

Megastar Movie: చిరంజీవి.. ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని మెగాస్టార్. ఈ హీరో థియేటర్లో అడుగుపెడితే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. ఒకప్పుడు ఆయన సినిమాలు ఆ రేంజ్ లో ఉండేవి. బాస్ మూవీ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేవి. ఆరుపదుల వయసులో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ హీరో.. మంచి సక్సెస్ తో ముందుకు సాగుతున్నాడు.


మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీతో మాస్ బీభత్సం సృష్టించి.. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు మెగాస్టార్. అద్భుతమైన కథలను ఎంచుకుంటూ.. మంచి డైరెక్టర్లతో క్రేజీ సినిమాలు చేయడానికి చిరు సిద్ధంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన కథను ఎంచుకున్న చిరంజీవి.. ఈ సినిమాకి డైరెక్టర్ గా శైలేష్ కొలను అయితే బాగుంటుందని భావించారట. ఇదే విషయాన్ని శైలేష్ కు చెప్పగా అతను మాత్రం తీయలేను అని కరాకండిగా తేల్చి చెప్పేశాడట. అంతేకాకుండా చిరంజీవి చెప్పిన స్టోరీ బదులుగా తాను రాసుకున్న కథతో చిరుని డైరెక్ట్ చేసి మూవీ తీయాలి అన్న తన ఉద్దేశాన్ని కూడా వివరించి చెప్పారట. అయితే ఈ విషయం కాస్త రాంగ్ గా బయటికి కనిపించడంతో చిరంజీవి చిత్రానికి శైలేష్ నో చెప్పాడు అని అనుకుంటున్నారు.


అయితే శైలేష్ కొలను స్టోరీని మాత్రమే కాదు అన్నారు.. మెగాస్టార్ తో మూవీ తీయను అని చెప్పలేదు. చిరంజీవి కోసం తానే స్వయంగా ఒక కొత్త కథని రాస్తానని శైలేష్ పేర్కొన్నాడట. చాలామంది డైరెక్టర్లు వేరే వాళ్ళు రాసిన స్టోరీలతో సినిమాలు తీయడానికి సిద్ధపడతారు. కానీ శైలేష్ ఎప్పుడు కూడా ఈ పద్ధతికి భిన్నం గా వ్యవహరిస్తారు. వేరొకరి రాసిన కథని తను అనుకున్నట్టుగా మలచడం చాలా కష్టం అన్న భావన శైలేష్ ది. అందుకే తానే స్వయంగా రాసుకున్న కథలను డైరెక్ట్ చేయడం ఆయనకు అలవాటు.

శైలేష్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది కుర్ర డైరెక్టర్లకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలా చేయడం వల్ల కథలోని కంటెంట్ తో పాటు సినిమాలో ప్యూరిటీ మిస్ కాదు అనేది అతని భావన. ఒక డైరెక్టర్ తాను ఊహించి రాసుకున్న కథలో.. ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారు అన్న విషయాన్ని జస్టిఫై చేయగలుగుతారు. అలాగే పాత్రలు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా కరెక్ట్ గా అంచనా వేయగలుగుతారు. ఈ విషయం లోపిస్తుంది కాబట్టే రీమేక్ చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. అలా చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే శైలేష్ మెగాస్టార్ కి నో చెప్పాడు తప్ప అంతకంటే మరో ఉద్దేశం ఏమీ లేదు. స్వతహాగా రాసిన కథతో శైలేష్ మెగాస్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×