HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు, ఏఎం రత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇంకా చిత్ర బృందం ప్రమోషన్లను మొదలుపెట్టలేదు. అయితే తాజాగా ఒక గ్లింప్ వీడియోతో ప్రమోషన్లను మొదలుపెట్టారు.
అభిమానులలో ఫుల్ జోష్…
ఇక ఈ వీడియోలో భాగంగా సినిమా విడుదలకు ముందు పోస్టర్లను అంటిస్తూ థియేటర్లను ముస్తాబు చేస్తూ సెలబ్రేషన్లకు సిద్ధం కమ్మని ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇంకా ప్రమోషన్లను మొదలు పెట్టకపోవడంతో అభిమానులలో చిన్న వెలితి ఉండేది కానీ ఈ వీడియోతో అభిమానులలో కూడా ఫుల్ జోష్ వచ్చిందని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ను వెండి తెరపై చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో…
పవన్ కళ్యాణ్ చివరిగా వెండితెరపై బ్రో అనే సినిమా ద్వారా కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన వరుస సినిమాలకు కమిట్ అయ్యారు కానీ, రాజకీయాలలో బిజీ కావడంతో ఈ సినిమాల షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇక చిత్ర బృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.
Theatres will thunder. ⚡️
Celebrations will erupt. 🥳🕺
Let’s celebrate Powerstar @PawanKalyan as #VeeraMallu like never before! 🔥#HariHaraVeeraMallu grand release worldwide this JUNE 12th! 🏹#HHVMonJune12th #HHVM #DharmaBattle @AMRathnamOfl @thedeol #SatyaRaj… pic.twitter.com/0XAIrllmBH— Mega Surya Production (@MegaSuryaProd) June 1, 2025
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే… ఈ చిత్రం 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన చారిత్రక సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడిగా కనిపిస్తారు. మొఘల్ సామ్రాజ్యం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఒక ఔట్‌లా యోధుడిగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, నాజర్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.