
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హిట్ ,ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ కలిగిన నటుడు. చాలా కాలం మంచి సక్సెస్ లేక తటపటాయిస్తున్న పవన్ కు గబ్బర్ సింగ్ మూవీతో మంచి బూస్టింగ్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కెరియర్ ను వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు తిరిగి ఈ ఇద్దరు క్రేజీ కాంబో మరొకసారి ఉస్తాద్ భగత్ సింగ్ గా మన ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఈసారి పవన్ ఈ మూవీతో తిరిగి తన చరిష్మా చూపిస్తాడని అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు.
మరోపక్క హరీష్ శంకర్ కూడా ఈ చిత్రంపై తన పూర్తి ఫోకస్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ తో మూవీ గురించి హరీష్ స్పెషల్ చిట్ చాట్ చేయడం జరిగింది. మూవీ గురించే కాకుండా తన కెరీర్ గురించి కూడా హరీష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేశారు. అలాగే తన మూవీస్ గురించి వచ్చే వ్యాఖ్యల పై కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ పవన్ ఫ్యాన్స్ ను వేరే లెవెల్లో ఖుష్ చేసింది. ఇందులో పవన్ మాస్ బీభత్సాన్ని డైరెక్టర్ ఎంతగానో ఎలివేట్ చేశాడు. ఫ్యాన్స్ తో మాట్లాడుతున్న హరీష్ ను మల్టీస్టారర్ సినిమా గురించి అడిగినప్పుడు దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే జరుగుతాయి అన్నట్లు సమాధానం ఇచ్చారు. ఇక ఓజీ కంటే ముందే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందా లేక ఓజీ యే ముందు వస్తుందా.. అలా వస్తే ఆ మూవీ అంచనాలు పెరుగుతాయి అంటారా.. అని అడిగినప్పుడు సినిమాలు పోటీ కోసం కాదు అది ఒక వేడుకతో సమానంగా భావించాలి అని ఎంతో పాజిటివ్ గా సమాధానం ఇచ్చారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీమేక్ అంటున్నారు.. అన్నప్పుడు.. మీరు నన్ను నమ్మండి, మీరు ఎంతో ఓర్పుగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటుంది. మీరు ఈ చిత్రంపై ఎటువంటి భారీ అంచనాలు పెట్టుకున్నారో నాకు తెలుసు..ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను కచ్చితంగా రీచ్ అయ్యే విధంగా ఉంటుంది.. అని కన్ఫామ్ గా స్పష్టత ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అన్న ధీమా డైరెక్టర్ గా అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక మీ మూవీస్ రీమేక్ లాగా ఉంటాయి అని ఇండస్ట్రీలో టాక్ ఉంది కదా.. కాఫీ కంటెంట్ వాడతారు అని అంటారు.. దీనిపై మీ అభిప్రాయం అని అడిగిన ప్రశ్నకు హరీష్ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. “నా గురించి, నేను చేసే వర్క్ గురించి తెలిసినవారు ఎవరైనా నా మూవీస్ రీమేక్ అని పిలవాలి అంటే సిగ్గుపడతారు. నాకు నేను చేసే పని ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. అయినా అందరూ పొగిడే వారు ఉంటే మనం చేసే పని మందగించిపోతుంది. మన చుట్టూ అప్పుడప్పుడు విమర్శించే వారు ఉండడం మనం ఇంకా బాగా ప్రయత్నించడానికి కారణం అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మీరు ఊహించిన దానికంటే.. ఓ రేంజ్ లో ఉంటుంది. పనిచేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది.. ఇక ఫలితం అంటారా అది ఎవరి చేతుల్లో ఉండదు” అని అన్నారు. ఇక ఈ మూవీ మాంచి మాస్ యాంగిల్ ఉన్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందని హరీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.