Harish Sankar : సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద సినిమా తీశామన్నది కాదు ఆ సినిమా సక్సెస్ అయిందా లేదా అన్నది మాత్రమే ఇక్కడ పాయింట్. అది హీరో హీరోయిన్ల కైనా లేదా డైరెక్టర్ కైనా కావచ్చు.. ఒక సినిమా జనాల్లోకి బాగా వెళ్తే ఆ సినిమా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు డైరెక్టర్ భారీ విజయాన్ని అందుకుంటాడు. ఇది అందరికీ తెలిసిందే కదా మళ్లీ ఎందుకు ఇది కొత్తగా చెబుతున్నారు అనే డౌట్ రావచ్చు కదా.. అందుకు ఒక కారణం ఉంది. సినిమా సక్సెస్ అయితే ఈ రోజుల్లో పెద్ద పండుగ అని ఆ చిత్రం బాగా పార్టీలు చేసుకుంటారు. సక్సెస్ మీట్ నిర్వహించి సినిమా సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఇవే అంటూ ప్రత్యేకంగా చెప్పుకొస్తున్నారు.. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.. ఈవెంట్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు..
ఈ సక్సెస్ మీట్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ గురించి అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా ఇప్పటివరకు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టీం మొత్తానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి సంబంధించిన షీల్డ్స్ ని అందించారు. ఒక సినిమాకి ఇలా షీల్డ్స్ అందుకొని ఎంత కాలం అయ్యిందో. 2000 సంవత్సరం లో ‘కలిసుందరం రా’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.. ఆ తర్వాత ఇన్నేళ్లకు అలాంటి బ్లాక్ బస్టర్ హీట్ ని వెంకటేష్ తన ఖాతాలో వేసుకున్నారు. నన్ను ఎన్నడు లేని విధంగా 300 కోట్లకు పైగా వసూలు చేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. సక్సెస్ మీట్ లో మూవీ టీం ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నిజమైన సక్సెస్ కి నిర్వచనం ఇదే కదా అని అనిపించింది.. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ డైరెక్టర్ హరి శంకర్ కి ఈవెంట్ లో ఘోర అవమానం జరిగిందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
అసలేం జరిగిందంటే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ కి ఇండస్ట్రీలోని పలువురు డైరెక్టర్లు నిర్మాతలు హాజరయ్యారు.. ఈ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన అందరి డైరెక్టర్ లకు పేరుపేరునా డైరెక్టర్ అనిల్ రావిపూడి కృతజ్ఞతలు చెప్తాడు. అక్కడే ఉన్నా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మాత్రం చూసి చూడనట్టుగా ఏమి చెప్పడు. అప్పుడు పక్కనే ఉన్న దిల్ రాజు హరీష్ శంకర్ అని అందించడంతో, అనిల్ రావిపూడి దానికి సమాధానం ఇస్తూ అంటే ముందు ఎదో ఒకటి పవర్ ఫుల్ గా జత చేసి చెపుదాం అని అనుకున్నాను అని చెప్తూ మా గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ కి కృతఙ్ఞతలు అంటూ కవరింగ్ చేసాడు.. ఈ విన్న హరి శంకర్ కాస్త సంతోషించినా కూడా లోపల మాత్రం బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది.. అనీల్ రావిపూడి కచ్చితంగా పేరు మర్చిపోయాడని, కవరింగ్ కోసమే అలా మాట్లాడాడు అంటూ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. అదే ఈవెంట్ కి అతిథి గా వచ్చిన మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని మాత్రం నా అన్న లాంటోడు అంటూ సంబోదించాడు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో హరీశ్ శంకర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. గెస్ట్ గా పిలిచి ఇంత ఘోరంగా అవమానిస్తారా? అని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో కాస్త నెట్టిండా వైరల్ అవుతుంది . ఇక దీనిపై అనిల్ రావిపూడి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..