Anchor Rashmi:ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) జబర్దస్త్ (Jabardast) షో ద్వారా యాంకర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు జబర్దస్త్ లోనే కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకరింగ్ చేస్తూ తన అందంతో, వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మడు సినిమాలలో కూడా నటించి మెప్పించింది. కానీ అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై రాణిస్తోంది. ముఖ్యంగా కమెడియన్ సుడిగాలి సుదీర్ తో ఎన్నో రియాల్టీ షోలు చేసి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే వీరిద్దరూ గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు అనే ప్రచారం నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. కానీ అదంతా పుకారు మాత్రమే అని వీరు కొట్టి పారేసినప్పటికీ ఏదో ఒక సందర్భంలో వీరిద్దరి గురించి వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి.
ఇకపోతే సుడిగాలి సుధీర్ సినిమాలలో నటిస్తూ.. బుల్లితెరకు దూరమైన రష్మీ మాత్రం జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ కి వెండితెరపై అవకాశాలు లేక మళ్ళీ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్లో రష్మితో కలిసి సందడి చేశారు. ఇకపోతే రష్మి ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్ట్లు పెడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు కూడా షేర్ చేసింది. “నేను సర్జరీ చేయించుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి ఇక వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ గాయం నా డాన్స్ మూమెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నింటినీ నేను మిస్ అవుతున్నాను. ఆ సర్జరీ అయ్యాక అంత సెట్ అవుతుందని భావిస్తున్నాను” అంటూ హాస్పిటల్ బెడ్ పై ఫోటోని కూడా పంచుకుంది. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన అభిమానులు అసలు ఆమెకు ఏమైందో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మీ త్వరగా కోలుకొని మళ్ళీ మునుపటిలాగే ఇండస్ట్రీలో బిజీ కావాలని కోరుకుంటూ ఉండడం గమనార్హం.
రష్మీ గౌతమ్ కెరియర్..
రష్మీ గౌతమ్ కెరియర్ విషయానికి వస్తే.. రష్మీ గౌతమ్ తల్లి ఒడిస్సా రాష్ట్రానికి చెందింది. ఈమె తండ్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు. ఇక పుట్టి పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. ఇక తండ్రి దూరం అవడంతో తల్లితో కలిసి చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాదుకు వచ్చింది. 2002లో ‘సవ్వడి’ అనే సినిమాతో ఈమె కెరియర్ మొదలైంది. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ (Uday Kiran) నటించిన ‘హోలీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఇక తర్వాత యువ అనే సీరియల్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో కన్నడలో వచ్చిన ‘గురు’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా సైమా అవార్డుకి నామినేట్ అయ్యింది.