BigTV English
Advertisement

Return Of The Dragon : ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీశ్ శంకర్ హైలెట్ స్పీచ్…

Return Of The Dragon : ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’  ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీశ్ శంకర్ హైలెట్ స్పీచ్…

Return Of The Dragon : టాలీవుడ్ లో చిన్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఈరోజుల్లో జనాలు కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. ప్రస్తుతం ఈ నెలలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ మూవీ కూడా ఒకటి.. ఈమూవీ ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్రయూనిట్ తో సహా ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరైయారు. అందులో మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ కూడా హాజరయ్యారు. ఈయన స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


 

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు..


Also Read : నాకు లైఫ్ ఇచ్చాడు.. ఆయన ఇలా తయారయ్యాడు… ఆర్జీవీపై విలన్ షాకింగ్ కామెంట్

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తెలుగులో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి హీరోని మనం సొంతం చేసుకుంటే.. ఆ హీరో ఏం చేసినా మనకు చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ అలాంటి ఇమేజ్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంతం చేసుకున్నారు. ఇక ప్రదీప్‌ని సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తే బాగుండు అని కోరుకుంటున్నా అని అన్నారు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఓ బ్రాండ్. టాలెంట్ హంట్‌లో మైత్రి రవి గారు చాలా ముందుంటారు. తెలుగులో మైత్రి ఎలానో.. తమిళంలో ఏజీఎస్ అలా ఉంటుంది. ఎప్పుడూ కొత్త కంటెంట్, కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్ కే ఎన్ మాట్లాడిన తరువాత మనం మాట్లాడటానికి ఏం ఉండదు. ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ బాగా రాశారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి అని అన్నారు. చిత్ర యూనిట్ ను అభినందించారు. మొత్తానికి ఈయన స్పీచ్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు బాగానే ఆకట్టుకింది. అప్డేట్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×