BigTV English

Actor : హీరోయిన్ పై మనసు పడ్డ యంగ్ హీరో… ఆ కోరిక మాత్రం నెరవేరలేదట పాపం

Actor : హీరోయిన్ పై మనసు పడ్డ యంగ్ హీరో… ఆ కోరిక మాత్రం నెరవేరలేదట పాపం

Actor : సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా నటీనటుల మధ్య ఎన్నో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అలాగే తాజాగా ఓ ప్రముఖ నటుడు హీరోయిన్ పై మనసు పడ్డాడని, కానీ అతని అసలు కోరిక మాత్రం నెరవేరలేదని టాక్ నడుస్తోంది. మరి ఆ కోరిక ఏంటి? అసలు ఈ హీరో హీరోయిన్ల మధ్య నడుస్తున్న కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


హీరోయిన్ పై మనసు పడ్డ హీరో…

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత కొంతమంది హీరోలకు డిమాండ్లు ఉంటాయి. హీరోలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే డిమాండ్ కూడా అంతే ఫాస్ట్ గా నెరవేరుతుంది. నిర్మాతలు సైతం వాళ్ళ డిమాండ్ కు తగ్గట్టుగానే డీల్ కుదుర్చుకుంటారు. ఇక స్టార్ హీరోల డిమాండ్ లకు అయితే నిర్మాతలు తల ఒగ్గక తప్పదు. ఎలాంటి కోరిక కోరినా సరే, దాన్ని తీర్చే తీరుతారు. మరి స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ కూడా అలాంటిది కదా…


కానీ చిన్న హీరోల పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. ఇండస్ట్రిలో అంత సులభంగా వాళ్ళ కోరికలు నెరవేరవు. పెద్ద హీరోల కోరికలు నెరవేరినంత ఈజీగా చిన్న హీరోల విషయంలో జరగదు. అయితే తాజాగా అలాంటి ఒక చిన్న హీరోకి ఒక ప్రత్యేకమైన కోరిక ఉందని, అది కూడా హీరోయిన్ విషయంలోనే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ హీరో పెద్దగా హిట్స్ ఇవ్వక పోయినప్పటికీ యూత్ ఆడియన్స్ లో ఆయనకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అతని అందానికి ఫిదా అయిన ఓ యంగ్ హీరోయిన్ కు అభిమానులలో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ హీరోయిన్ నటించిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఓ ప్రముఖ డైరెక్టర్, ఒక సీనియర్ స్టార్ తో ఈ అమ్మడు సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. అయితే తాజాగా మన యంగ్ హీరో ఆ హీరోయిన్ పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తన రాబోయే సినిమాలో ఆ హీరోయిన్ తో నటించాలని ఫిక్స్ అయ్యాడట. కానీ నిర్మాతలు ఈ హీరోకి షాక్ ఇచ్చారని తెలుస్తోంది.

షాక్ ఇచ్చిన నిర్మాతలు 

ఆమెను ఈ ప్రాజెక్టులో చేర్చడానికి హీరో ప్రయత్నించగా, అది వర్కౌట్ కాలేదట. అప్పటికే హీరోయిన్ ఫైనల్ అయిపోయింది. హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే పోయింది, కనీసం ఏదో ఒక చిన్న రోల్ లేదా కనీసం ఐటమ్ సాంగ్ లో ఆమెను నటించేలా చేయాలని గట్టిగానే ట్రై చేశాడట ఈ హీరో. కానీ అది కూడా కుదరకపోవడంతో డీలా పడ్డట్టు తెలుస్తోంది. ఇక నిర్మాతలు బడ్జెట్ లిమిట్స్ కారణంగా హీరో కోరికను మన్నించలేదట. ఆ హీరో చివరగా సైలెంట్ గా ఉండడం తప్ప ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ హీరో ఇంతకు ముందే ఆ హీరోయిన్ తో ఒక సినిమా చేశాడని, ఇప్పుడు మళ్లీ ఆమెతో కలిసి ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తెలుగు స్టార్స్ కావడం మరో విశేషం.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×