New Blood Test: డయాబెటిస్ వ్యాధి అన్ని వ్యాధుల వారిని ప్రభావితం చేస్తోంది. ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోంది. పిల్లలకు ప్రధానంగా టైప్- 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లల్లో టైప్- 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లు ఓ పరిశోధనలో కనుగొన్నారు. చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడితే ఇది ఇతర తీవ్ర సమస్యలకు కారణం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పిల్లల్లో టైప్- 2 డయాబెటిస్ ముందుగానే గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ పరిశోధనల్లో భాగంగానే లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజ్‌లో లిపిడ్లు, పిల్లల జీవక్రియను ప్రభావితం చేసే వ్యాధుల మధ్య గల సంబంధాన్ని డాక్టర్లు కనుగొన్నారు. అంతే కాకుండా కాలేయ వ్యాధులతో పాటు మరికొన్ని వ్యాధులను ముందుగా గుర్తించే విధానాన్ని కూడా కనుగొన్నారు.
నేచర్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం టైప్- 2 డయాబెటిస్, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించడానికి లిపిడ్లను ఉపయోగించే ఒక బ్లెడ్ టెస్టును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటికే హాస్పిటల్స్‌లో చేస్తున్న ప్లాస్మా టెస్టులు పిల్లల్లో ముందుగానే వివిధ రకాల వ్యాధులను గుర్తించి చికిత్స చేయడానికి ఉపయోగపడుతున్నాయి.
సాధారణంగా లిపిడ్లు అంటే శరీరంలో కొవ్వు ఆమ్లాలు, మంచి, చెడు కొలెస్ట్రాల్ . అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్న 1300 మంది పిల్లల రక్త నమూనాలు సేకరించిన పరిశోధకులు వారిలోని లిపిడ్‌ల పని తీరును గమనించారు. తర్వాత వారిలో 200 మందికి ఒక ఏడాది పాటు HOLBAEK నిర్ధిష్ట జీవనశైలిని అలవరుచుకునేలా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం ద్వారా కొంత మంది పిల్లల్లో BHIలో కొంత వరకు పెరుగుదల ఉన్నప్పటికీ డయాబెటిస్ తో పాటు ఇన్సులిన్ నిరోధకత, రక్త పోటుతో సంబంధం ఉన్న లిపిడ్ లు తగ్గాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
భవిష్యత్తులో ఈ రక్త పరీక్ష ముందుగానే పిల్లల్లో వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడంలో ప్రభావ వంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా లిపిడ్ అణువులను ఎలా మార్చాలో అధ్యయనం చేయడం ద్వారా డయాబెటిస్ వంటి వ్యాధులను పూర్తిగా నివారించవచ్చు. ఇలాంటి పరీక్షల ద్వారా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
టైప్ 1 డయాబెటిస్ :
టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా పిల్లలు, యువకులలో ఎక్కువగా వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా మన శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతుంది.
Also Read: రాత్రి పడుకునే ముందు నారింజ తింటున్నారా ?
టైప్ – 2 డయాబెటిస్ ప్రధానంగా పెద్ద వారిలో కనిపిస్తుంది. పిల్లలు కూడా దాని బాధితులుగా మారే ప్రమాదం కూడా ఉంది. పిల్లలలో మధుమేహం లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ప్రారంభ లక్షణాలతో టైప్- 2 డయాబెటిస్ గుర్తించవచ్చు. అంతే కాకుండా టెస్టుల ద్వారా కూడా కనుగొనవచ్చు.