E-Paper
Advertisement

Sundaram Master OTT Release: కామెడీ పాఠాలు చెప్పడానికి ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Sundaram Master OTT Release: కామెడీ పాఠాలు చెప్పడానికి ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Advertisement
Sundaram Master
Sundaram Master

Sundaram Master OTT Release Date: సిని ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం ఎంతోమంది పరితపిస్తుంటారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. ఇలా ఎంతో మంది తమకు వచ్చిన అవకాశంతో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అందులో నటుడు హర్ష చెముడు ఒకరు. ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు వైవా హర్షగా బాగా తెలుసు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లలో ఎక్కువగా కనిపించి అలరిస్తుంటాడు. ఎలాంటి పాత్రలో అయినా తన నటనతో నవ్వించగలడు, ఏడిపించగలడు.

Advertisement

కలర్ ఫొటో సినిమాతో మరింత ఫుల్ క్రేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమాలోనూ సైడ్ క్యారెక్టర్‌లలో నటించి అదరగొడుతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ఊరుపేరు భైరవ కోన సినిమాలో కూడా తన టైమింగ్ కామెడీతో అందరినీ నవ్వించాడు.

Also Read: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా

Advertisement

అయితే ఎప్పుడు సైడ్ క్యారెక్టర్లేనా.. ఒకసారైనా హీరోగా చేస్తే బాగుంటుందని ఒక అడుగు ముందుకు వేశాడు హర్ష. అతడు హీరోగా నటించిన కొత్త సినిమా ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో హర్షకి జోడీగా దివ్యశ్రీ పాద హీరోయిన్‌గా నటించింది.

వీరిద్దరూ కలిసి ఇదివరకు కలర్ ఫొటోతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించారు. అయితే హీరో హీరోయిన్లుగా వీరిద్దరి మొదటి సినిమా ఇది. ఆర్‌టీటీ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. దీంతో ఈ చిత్రం ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: 7 ఆస్కార్ అవార్డులు గెలిచిన ఓపెన్‌హైమర్ సినిమా చూశారా.. తెలుగు వెర్షన్ వచ్చేసింది..

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. స్ట్రీమింగ్ సంస్థ ఆహా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. మాస్టర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి మన ఇంటికి వచ్చేస్తున్నాడు రెడీగా ఉండండి అంటూ ఆహా తెలిపింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×