Big Stories

Oppenheimer: 7 ఆస్కార్ అవార్డులు గెలిచిన ఓపెన్‌హైమర్ సినిమా చూశారా.. తెలుగు వెర్షన్ వచ్చేసింది..

Oppenheimer
Oppenheimer

Oppenheimer: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓపెన్‌హైమర్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అణుబాంబు పితామహుడు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

- Advertisement -

గతేడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా చూపించి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1 బిలియన్ డాలర్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

- Advertisement -

ఈ మూవీలో పీకీ బ్లైండర్స్ ఫేమ్ సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. అతడితో పాటు ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ త‌దిత‌రులు ప్ర‌ముఖ పాత్ర‌లు పోషించారు.

Also Read: పుష్ప 2 నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్.. సమంత ఈ సారి సాంగ్‌లో కాదు.. ఏకంగా

ఇక ఈ మూవీ ఎన్నో రికార్డులను, అవార్డులను అందుకుని అందరినీ అబ్బురపరచింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమర్ మూవీ ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అయింది. అయితే అందులో 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

అందులో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ అవార్డులు గెలుచుకుని అందరినీ అట్రాక్ట్ చేసింది.

దీంతో ఈ ఏడాది అత్యధిక ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న సినిమాగా ఓపెన్‌హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రానికి ఆస్కార్ రావడంతో చాలామంది ఈ మూవీని చూడటానికి ఎంతో తహతహలాడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: కల్కి మూవీ ఓటీటీ రైట్స్ ఎంతో తెలుసా.. ఏకంగా రెండు మూడు సినిమాలు తీయొచ్చు..

అలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నవారికి తాజాగా ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు మరికొన్ని భాషల్లోకి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో ఈ మూవీ తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వెర్షన్లు స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పట్నుంచో చూడాలని వెయిట్ చేస్తున్న సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News