E-Paper
Advertisement

Emraan Hashmi Look from OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా!

Emraan Hashmi Look from OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా!
PAWANKALYAN
PAWANKALYAN

Emran Hashmi First Look Released from Pawan Kalyan’s OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతేడాది బ్రో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘ఓజీ’ మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ముంబై డాన్ పాత్రలో పవన్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఓ రేంజ్‌లో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా టీజర్‌లో పవన్ మాస్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్న పవన్ ఇందులో తన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read: 7 ఆస్కార్ అవార్డులు గెలిచిన ఓపెన్‌హైమర్ సినిమా చూశారా.. తెలుగు వెర్షన్ వచ్చేసింది..

కాగా ఈ మూవీలో శ్రియారెడ్డి, అర్జున్ దాస్, తేజ్ సఫ్రూతో సహా మరికొంత మంది నటీనటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ రోజు ఇమ్రాన్ హష్మీ బర్త్ డే. ఈ సందర్భంగా ఓజీ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్‌లో ఇమ్రాన్ హష్మీ చాలా సీరియస్‌గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. దీని బట్టి చూస్తే ఇమ్రాన్ ఇందులో ఓం భాయ్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Also Read: పుష్ప 2 నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్.. సమంత ఈ సారి సాంగ్‌లో కాదు.. ఏకంగా

ఇదిలా ఉంటే ఇమ్రాన్ హష్మీ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం ఓజీనే కావడంతో అందరిలోనూ మంచి హైప్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు యంగ్ హీరో అడివిశేష్ నటిస్తున్న గుఢాఛారి 2 మూవీలో కూడా ఇమ్రాన్ నటిస్తున్నాడు.

ఇకపోతే పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ ఓజీ మూవీతో పాటు మరోవైపు ‘హరిహర వీరమల్లు’ మూవీ కూడా చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దీపావళి నాటికి పూర్తి చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×