BigTV English
Advertisement

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

HarshaSai: హర్షసాయికి చుక్కెదురు.. బెయిల్ దొరకనట్టేనా..?

HarshaSai: ప్రముఖ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షసాయి (Harsha Sai) లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఒక సినీనటి హర్షసాయి పై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ముఖ్యంగా తన దగ్గర రూ.2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, అక్కడితో ఆగకుండా అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని తన తండ్రి వద్దకు తీసుకెళ్తే , బయటకు వస్తే తన కొడుకు కెరియర్ ఆగిపోతుంది అని భావించి, అతడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడని, పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారంటూ ఒక సినీ నటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కేస్ ఫైల్ చేసుకున్న పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రపంచ విహారయాత్రికుడు వద్ద ఉన్నట్టు అక్కడ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవి బయటకు రాలేదని చెప్పాలి.


ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసిన తెలంగాణ హైకోర్టు..

ఇదిలా ఉండగా మరోవైపు హర్ష సాయికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయి అలాగే ఆయన తండ్రి రాధాకృష్ణ తోపాటు ఇంకొక వ్యక్తి ఇమ్రాన్ ముందస్తు బెయిల్ కావాలి అని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు హర్ష సాయితో పాటు హర్ష తండ్రి రాధాకృష్ణ అలాగే ఇంకొక వ్యక్తి ఇమ్రాన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు ఫిర్యాదు చేయకముందే, కేసులో నిందితులుగా వీరిని చేర్చక ముందే , ముందస్తు బెయిల్ కావాలి అని హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని విచారించిన హైకోర్టు కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. అంతేకాదు కేసులో నిందితులుగా చేర్చిన తర్వాతనే ముందస్తు బెయిల్ కు రావాలని కూడా న్యాయస్థానం తెలిపింది.


హర్షసాయికి బెయిల్ దొరుకుతుందా..

ఇకపోతే హర్ష సాయికి , బాధితురాలికి పెళ్లి చేయాలనుకున్న హర్షసాయి తండ్రి రాధాకృష్ణ మొదట బాధితురాలు వద్దకు వెళ్లి ప్రపోజల్ పెట్టాడు అని హర్షసాయి తరపు న్యాయవాది వెల్లడించారు.. ఫిర్యాదులో మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడు అంటూ బాధితురాలు పేర్కొంది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన వీరు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోగా.. ఇప్పుడు ఆ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టి వేసినట్లు సమాచారం. మొత్తానికైతే హర్ష సాయికి బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. హర్ష సాయికి ఇప్పుడు చుక్కెదురైందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో హర్ష సాయి పై బాధిత యువతి కంప్లైంట్..

ఇకపోతే తాజాగా హర్ష సాయి పై బాధిత యువతి మరో కంప్లైంటు ఇచ్చింది. కొంతమంది చేత తనపై అసభ్యకరంగా కామెంట్లు చేయిస్తూ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఉపయోగించుకొని తనపై రూమర్స్ ప్రచారం చేయిస్తున్నాడు అంటూ బాధిత యువతి కంప్లైంట్ ఇచ్చింది. మరి ఈ మేరకు కేస్ ఫైల్ చేసుకున్న పోలీసులు హర్షసాయి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×