BigTV English

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి
Rice Water: ఒకప్పుడు అన్నం ఉడకడానికి ఎక్కువ నీటిని వేసి ఆ గంజిని వార్చేవారు. అలా వచ్చిన గంజిని తిరిగి ఆహారంలో కలుపుకొని తినేవారు. ఆ గంజిలో ఎన్నో పోషకాలు ఉండేవి. అందుకే అప్పట్లో మనుషులంతా ఎంతో బలంగా ఉన్నారని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు వండే పద్ధతులు మారిపోయాయి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు వచ్చేసాయి. దీంతో గంజి రావడమే మానేసింది. గంజి వార్చే పద్ధతిలోనే అన్నాన్ని వండి ఆ గంజిని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
గంజినీటి వల్లే ఇలాంటి రోగాలు బారిన పడకుండా మన పూర్వీకులంతా ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కేవలం వేసవిలోనే కాదు ఏ కాలంలోనైనా గంజిని తాగడం వల్ల మేలే జరుగుతుంది. వేసవిలో ఈ గంజిని తాగితే డీహైడ్రేషన్ అనే సమస్య దగ్గరకే రాదు. గంజిలో కొన్ని ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని తాగితే చాలు. డీహైడ్రేషన్ అనేది శరీరాన్ని తాకదు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలన్నా కూడా గంజినీరు రక్షణగా నిలుస్తుంది. గంజి నీటిని తాకడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గంజి వచ్చేలా అన్నం ఉండి ఆ గంజిని వేడివేడిగా తాగి చూడండి. శరీరానికి ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఈ గంజిని కూరల్లో కూడా వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల కూరలు చిక్కగా ఇగురు లాగా వస్తాయి. మీ ఇంట్లో పిల్లలకు గంజిని తాగించేందుకు ప్రయత్నించండి. ఇది ఖనిజాలు, విటమిన్లతో ఉంటుంది. కాబట్టి వారి శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే వారికి బలాన్ని అందిస్తుంది.
పిల్లలకు, పెద్దలకు జీర్ణశక్తిని అందించాలంటే గంజి మొదటి స్థానంలో ఉంటుంది. గంజిని బేబీ ఫుడ్ గా కూడా భావించవచ్చు. చంటి పిల్లలకు గంజినీటిని తాగించేందుకు ప్రయత్నించండి. ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. వారు విరేచనాలు బారిన పడితే డీహైడ్రేషన్ సమస్య శరీరంలో రాకుండా ఉండాలంటే గంజిని తాగిస్తూ ఉండండి. ఆరు నెలలు దాటిన పిల్లలకు గంజినీళ్లను తాగించవచ్చు. ఆ గంజిలో మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసి చేతితోనే మెత్తగా మెదిపి, రుచికి చిటికెడు ఉప్పు వేసి చంటి పిల్లలకు తినిపించండి. ఇది వారికి ఎంతో నచ్చుతుంది. ఏడు ఎనిమిది నెలల వయసు ఉన్న ఏ పిల్లలకైనా ఈ ఆహారాన్ని తినిపించవచ్చు.
గంజినీళ్లను తాగడం వల్ల విరేచనాలు ఆగిపోతాయి. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడేవారు గంజినీరుని అధికంగా తాగండి. బయట దొరికే ఓఆర్ఎస్ కన్నా గంజినీళ్లే శక్తివంతంగా పనిచేస్తాయి. దీన్ని ఎనర్జీ డ్రింక్ గా భావించి తాగడం అలవాటు చేసుకోండి.
గంజినీళ్లు రోజూ తాగే వారి చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. వారి జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. గంజి నీళ్లు అధికంగా ఉంటే ఆ నీళ్లతోనే జుట్టును తడుపుకొని కాసేపు ఉండండి. తర్వాత స్నానం చేయండి. మీ వెంట్రుకలు మెరవడం గమనిస్తారు. అదే గంజినీటితో కాటన్ దుస్తులను చివరిలో ఉతికినా కూడా అవి మెరుపువంతంగా కనిపిస్తాయి. గంజినీటిని వచ్చేలా ఉండడం చాలా సులువు.
గంజినీరు కావాలంటే ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీటిని వేయండి. అన్నం ఉడికే వరకు ఆ నీటిని అలాగే ఉడికించి తర్వాత వడకట్టండి. లేదా వార్చండి. గంజినీరు వేరవుతుంది. అన్నం పొడిపొడిగా వస్తుంది. ఆ గంజిని చల్లార్చి చిటికెడు ఉప్పు వేసుకొని తాగి చూడండి. శరీరానికి శక్తి వెంటనే అందుతుంది.


Related News

Weight Loss Tips: ఉలవలు తినడం వల్ల ఊహించలేని ఆరోగ్య మార్పులు!

Health Benefits: ఇంగువలో బెల్లం కలిపి తింటే ఇన్ని ప్రయోజనాలా! అస్సలు నమ్మలేరు

Apple Seeds: నమ్మలేని నిజం.. యాపిల్ విత్తనాలు తింటే ప్రాణానికే ప్రమాదమా?

Madhavan: నో జిమ్, నో వర్కౌట్స్.. 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్!

Ichthyosis Vulgaris: ఇదో వింత వ్యాధి, లక్షణాలు గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం

Ajwain Health Benefits: మందులు అవసరమే లేదు.. ఈ కషాయం తాగితే జలుబు మాయం

Papaya: వీళ్లు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదు !

Cumin Health Benefits: చిన్నగా ఉందని చులకన చేయకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

Big Stories

×