BigTV English

Sankranthiki Vasthunam Twitter Review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ..

Sankranthiki Vasthunam Twitter Review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ..

Sankranthiki Vasthunam Twitter Review: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ అనేది ఎవర్‌గ్రీన్ అని ప్రేక్షకులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను 100 శాతం ఎంటర్‌టైన్ చేయాలంటే ఈ కాంబోనే కరెక్ట్ అని ఫ్యాన్స్ అంటుంటారు. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ చూస్తేనే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఇంప్రెస్ చేసిందో తెలియాంటే ఈ ట్విటర్ రివ్యూలపై ఓ లుక్కేయండి.


‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అప్పుడే పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్.

సంక్రాంతికి ఈ సినిమాను కచ్చితంగా ఫ్యామిలీతో చూడమని ఆల్రెడీ చూసిన ప్రేక్షకులు రికమెండ్ చేస్తున్నారు.

కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీ యావరేజ్‌గా ఉందంటూ యావరేజ్ రేటింగ్ ఇస్తున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’లో చిన్న చిన్న తప్పులు ఉన్నా.. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు.

వెంకీ మామతో పాటు ఐశ్వర్య రాజేశ్ నటన కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని ప్రశంసిస్తున్నారు.

మొత్తానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఒక యావరేజ్ సినిమా అని, కామెడీ మాత్రమే ఈ సినిమాను కాపాడిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ప్రేక్షకులకు మాత్రం సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువగా నచ్చిందని అంటున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్ కొడుకు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. సినిమా చూసిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని తన యాక్టింగ్‌తో ఫిదా చేశాడని తెలుస్తోంది.

మూవీలో కామెడీ బాగానే ఉందని అనిపించినా మిగతా సినిమా అంతా బోరింగ్ అంటూ ఒక నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఒక మామూలు అనిల్ రావిపూడి సినిమా అని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు ప్రేక్షకులు.

‘సంక్రాంతికి వస్తున్నాం’లో కీలక పాత్రల్లో కనిపించిన వీటీవీ గణేశ్, యానిమల్ ఉపేంద్ర, చిన్న రాజు గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

యూత్‌కు ఈ సినిమా క్రింజ్ అనిపించినా కూడా ఫ్యామిలీస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించి వారికి గుర్తుండిపోతుందని యూఎస్ ప్రీమయర్ చూసిన ప్రేక్షకుడు రివ్యూ అందించాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లైమాక్స్‌ను ‘ఎఫ్ 2’ క్లైమాక్స్‌తో పోలుస్తూ కొందరు ప్రేక్షకులు రివ్యూ అందిస్తున్నారు.

ఈ స్టోరీ లైన్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’పై నెగిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.

అనిల్ రావిపూడి కామెడీ చాలా క్రింజ్ అని, ఇప్పటికైనా మారమని కొందరు ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×