RGV: ఈ ఏడాది మొదట్లోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ రేంజ్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఇకనుంచి నేను ఎలాంటి వివాదాలకు వెళ్ళను.. గొడవలకు దూరంగా ఉంటాను అని రాసుకొచ్చాడు. దీంతో పోనీలే ఇప్పటికైనా వర్మలో రియలైజేషన్ వచ్చింది అనుకున్నారు. కానీ, అక్కడ ఉన్నది వర్మ అన్న విషయాన్నీ మర్చిపోయారు. వివాదాన్నే ఊపిరిగా తీసుకొని బ్రతుకుతున్న ఆర్జీవీ అసలు కాంట్రవర్సీ లేకుండా ఎలా బతకగలడు.
కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వర్మ .. ఇక ఇప్పుడు మరోసారి ట్వీట్ల పురాణంతో విజృంభించాడు. మొదటి నుంచి వర్మకు మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ తప్ప ఏ హీరో నచ్చడు. ఈ విషయాన్నీ వర్మ ఎన్నోసార్లు బహిరంగంగా కూడా చెప్పాడు. అసలైన మెగాస్టార్ అల్లు అర్జున్ అని కూడా రాసుకొచ్చాడు. పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి రోజుకో పోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు.
పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్” అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగలేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూనే వచ్చాడు. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన వర్మ.. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా చూసి .. మరోసారి రెచ్చిపోయాడు. ఆ సినిమాకు, ఈ సినిమాకు వచ్చిన కలక్షన్స్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు.
Social Activist Devi: ఆ డైరెక్టర్ కు మదమెక్కింది.. హీరోయిన్ శరీరాలను ముక్కలు ముక్కలుగా అమ్ముతున్నారు
గేమ్ ఛేంజర్ ఫేక్ కలక్షన్స్ పై దుమ్మెత్తిపోశాడు. అంతేకాకుండా ఫైరసీ లీక్ అయ్యిందని మేకర్స్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసిన విషయం కూడా విదితమే. ఇక దాని గురించి కూడా సెటైర్ వేశాడు. “తెలుగు సినిమా రియల్ టైమ్ కలెక్షన్స్‌ను అద్భుతంగా స్ట్రాటో ఆవరణలోకి తీసుకువెళ్ళింది రాజమౌళి, సుకుమార్ అనుకుంటే తద్వారా బాలీవుడ్‌లోకి షాక్ వేవ్‌లను పంపింది. GC వెనుక ఉన్న వ్యక్తులు దక్షిణాదిని మోసం చేయడంలో విజయం సాధించారు.
GC ఇలా క్లెయిమ్ చేయడం వలన బాహుబలి, RRR, Kgf 2, కాంతారా మొదలైన సినిమాల విజయాలపై డౌట్ మొదలయ్యింది. ఇంత పెద్ద హిట్ సినిమాలను అణగదొక్కే ఈ అత్యంత అవమానకరమైన అవమానం వెనుక ఎవరు ఉన్నారో నాకు నిజంగా తెలియదు. ఈ నమ్మశక్యం కాని అమాయక అబద్ధాల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది నిర్మాత దిల్ రాజు కాలేడు ఎందుకంటే అతను నిజమైన గ్రౌన్దేడ్ రియలిస్ట్. మోసం చేయడం అతడు అసమర్థుడు” అని రాసుకొచ్చాడు.
అంతేకాకుండా “G Cకి దాదాపు 450 కోట్లు ఖర్చయితే, ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ అప్పీల్‌లో RRRకి 4500 కోట్లు ఖర్చు చేయాలి. G C సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లు అయితే, పుష్ప 2 కలెక్షన్స్ 1,860 కోట్లు ఉండాలి. నిజం చెప్పినా నమ్మేలా ఉండాలి. అబద్దం చెప్తే అది ఇంకా నమ్మించేలా ఉండాలి” అని రాసుకొచ్చాడు. ఇక చివర్లో “నేను పుష్ప 2ని ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు G C చూసిన తర్వాత.. అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ల మీద పడాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
I loved PUSHPA 2 but now after seeing G C I want to fall on the feet of @alluarjun and @SukumarWritings 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025
If G C costed some 450 cr then RRR in its extraordinary never before seen visual appeal should have costed 4500 cr and if G C film’s first day collections are 186 cr on day 1 , then PUSHPA 2 collections should have been 1,860 cr ..The point is that the fundamental requirement of…
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025
If @ssrajamouli and @SukumarWritings sky rocketed telugu cinema in real time collections into a fantastically stratospheric heights thereby sending legitimate shock waves into Bollywood, the people behind G C succeeded in proving that the south is much more FANTASTIC in being a…
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025