RC 17: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సాధించింది. అలాగే అందులో రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే తన తరువాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా పెరిగింది. చాలాకాలంగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సైతం విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాలని ఈ మెగా హీరో ఫిక్స్ అయ్యాడు. ఇదే సమయంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’ (RC 17) గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.
సీక్వెల్ కాదు
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ఎన్నో అడ్డంకుల తర్వాత ఫైనల్‌గా సంక్రాంతికి విడుదల కాబోతోంది. అందుకే ఆ తర్వాత బుచ్చిబాబుతో చేసే సినిమాపై ఫోకస్ మొదలుపెట్టాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడట. బుచ్చిబాబుతో సినిమా తర్వాత సుకుమార్‌తో మూవీని ఓకే చేశాడు చరణ్. గురు, శిష్యులకు ఒకేసారి ఛాన్స్ ఇచ్చి తన తరువాతి సినిమాల బాధ్యతలను వారిపై వేశాడు. ముందుగా సుకుమార్‌తో రామ్ చరణ్ చేసే మూవీ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. ఇది ‘రంగస్థలం’ సినిమాకు సీక్వెల్ అని లేదా అదే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే స్టోరీ అని వార్తలు వైరల్ అయ్యాయి. అవన్నీ నిజం కాదని తేలిపోయింది.
Also Read: ‘హరిహర వీరమల్లు’ నుండి క్రిష్‌తో పాటు నేను కూడా తప్పుకున్నా.. బయటపెట్టిన రైటర్
యూత్ కోసమే
సుకుమార్ (Sukumar), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’లో ఈ మెగా హీరో ఒక కొత్త అవతారంలో కనిపించనున్నట్టు సమాచారం. ఆ సినిమా కోసం తన స్టైల్ మొత్తం మారనుందట. ఒక సిటీలో జరిగే సమస్య చుట్టూ తిరిగే కథ ఇది అని, ఇందులో చరణ్ చాలా స్టైలిష్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనుందట. ముఖ్యంగా ఈ మూవీని యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా తెరకెక్కించాలని సుకుమార్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
అలాంటిది కాదు
సుకుమార్, రామ్ చరణ్ ఇంతకు ముందు ‘రంగస్థలం’ సినిమా కోసం కలిసి పనిచేశారు. అప్పటివరకు లెక్కలతో సినిమాలను తెరకెక్కించిన సుకుమార్.. మొదటిసారి తన లెక్కలను పక్కనపెట్టి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో అడుగుపెట్టాడు. అలా చరణ్‌తో ‘రంగస్థలం’ తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయ్యిందంటే అలాంటి ఒక మాస్ ఎంటర్‌టైనర్‌నే ప్రేక్షకులు కోరుకున్నారు. కానీ సుకుమార్ మాత్రం వెరైటీగా రామ్ చరణ్‌ను మోడర్న్ లుక్‌లో చూపించాలని ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యే వరకు ‘ఆర్‌సీ 17’పై పూర్తిస్థాయిలో క్లారిటీ ఉండదు.