Viswambhara : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే బిగ్ బడ్జెట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.. ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తిచేసి సీజీ వర్క్ ని పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మొదటగా సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు. గేమ్ ఛేంజర్ వల్ల ఈ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ లో సినిమాలు ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఇక చిరంజీవి సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాని మే 9న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది..
ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ విమర్శలు అందుకున్నాయి. హాలీవుడ్ సినిమాలను కాపీ కొడుతున్నారని ట్రోల్స్ ని అందుకుంది. ఎందుకు కారణం సినిమా సీసీ వర్క్ పై సరిగ్గా ఫోకస్ చెయ్యకపోవడమే అని గతంలో చిరంజీవి చెప్పాడు. ఇప్పుడు సినిమాని వాయిదా వేయడం ఒకందుకు మంచిది అయ్యిందని చెప్పాలి.. సీజీ వర్క్ మరింత క్వాలిటీతో ప్రెజెంట్ చేసే అవకాశం విశిష్టకి వచ్చింది. సోషియో ఫాంటసీ చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీలో ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మే 9న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. చిరంజీవి ఆరోజును ఫిక్స్ చేసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ మే 9న రిలీజ్ అయ్యింది. అందుకే సెంటిమెంటల్ గా కలిసొస్తుందని యూవీ క్రియేషన్స్ వారు కూడా అదే డేట్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది..
ఈ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో త్రిష మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాని ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంతో పోల్చి చూస్తున్నారు.. కానీ ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పడితేనే చిరంజీవి హిట్ ట్రాక్ ఫాంలోకి వస్తుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలలో ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే. ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. అయితే ‘విశ్వంభర’ నుంచి మెగాస్టార్ కథల ఎంపిక మార్చుకున్నట్లు తెలుస్తోంది. రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని అందుకుంటుందో తెలియాలంటే వెయిట్ చేయాలి..