BigTV English

Balakrishna: బాలయ్య ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ వదులుకున్నారా? అసలు కారణం..?

Balakrishna: బాలయ్య ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ వదులుకున్నారా? అసలు కారణం..?

Balakrishna:కొంతమంది దర్శకులు చెప్పే స్టోరీలు నచ్చకనో లేక వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వలనో తెలియదు కానీ.. స్టార్ హీరోలు మాత్రం పెద్ద పెద్ద సినిమాలను వదులుకుంటారు. అయితే మొదట ఆ హీరోలకు డైరెక్టర్లు చెప్పే స్టోరీలు అంతగా నచ్చవు. కానీ అవి వేరే హీరోలతో చేసి, హిట్టు కొట్టాక అబ్బా అనవసరంగా ఒక మంచి సినిమాను వదులుకున్నామే.. నేను చేసుంటే ఇంకా బాగుండేది కదా అని అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారట. ఇక బాలకృష్ణ వదులుకున్న ఈ ఐదు సినిమాలు ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్స్ కొట్టాయి. మరి ఇంతకీ బాలకృష్ణ వదులుకున్న ఆ టాప్ 5 సినిమాలు ఏంటి..?అవి ఎందుకు వదులుకున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.


సింహాద్రి:

రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) హీరోగా చేసిన ‘సింహాద్రి’ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే అలాంటి సింహాద్రి మూవీ లో హీరోగా మొదట బాలకృష్ణ (Balakrishna)నే అనుకున్నారు. అయితే బాలకృష్ణ ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ రాజమౌళి కొత్తవాడు కావడంతో బాలకృష్ణ సినిమాని రిజెక్ట్ చేశారట. అలాగే సింహాద్రి సినిమా చేసే సమయంలో ఆయన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఒప్పుకున్నారు. దాంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసి పల్నాటి బ్రహ్మనాయుడు మూవీలో నటించినప్పటికీ ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ అయింది.అలా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సింహాద్రిని రిజెక్ట్ చేసి పల్నాటి బ్రహ్మనాయుడు మూవీతో డిజాస్టర్ అందుకున్నారు బాలకృష్ణ.


జానకి రాముడు:

నాగార్జున(Nagarjuna), విజయశాంతి(Vijayashnathi) కాంబినేషన్లో వచ్చిన ‘జానకి రాముడు’ మూవీకి రాఘవేంద్రరావు (Raghavendra rao ) దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టింది. అయితే ఈ సినిమా అవకాశం మొదట బాలకృష్ణకే వచ్చిందట. జానకి రాముడు మూవీకి మొదట కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)దర్శకుడు. అయితే కొన్ని కారణాల చేత కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలకృష్ణ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నారట. అలా ఈ మూవీ రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

చంటి:

తమిళంలో ‘చిన్న తంబి’గా విడుదలైన ఈ సినిమాని తెలుగులో నిర్మాత రామానాయుడు (Ramanaidu) రీమేక్ రైట్స్ కొన్నారు. ఇక ఈ మూవీ మొదట బాలకృష్ణ కే ఆఫర్ వచ్చిందట. పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణతో ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ బాలకృష్ణ ఆ పాత్రలో నటించను. నాకు స్టోరీ నచ్చలేదు అని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత రాజశేఖర్(Rajasekhar) ని కూడా అనుకున్నప్పటికీ, చివరికి వెంకటేష్ (Venkatesh) ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పటికి కూడా వెంకటేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ చంటి.

సింహరాశి :

యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ (Rajasekhar) హీరోగా చేసిన ‘సింహరాశి’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మొదట బాలకృష్ణకే వచ్చిందట. అయితే ఇది తమిళ్ మూవీ రీమేక్ అని చెప్పి నేను రీమేక్ లో నటించను అని బాలకృష్ణ రిజెక్ట్ చేశారట. అలా సింహరాశి మూవీ రాజశేఖర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకుంది.

క్రాక్:

రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన ‘క్రాక్’ మూవీ రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి క్రాక్ మూవీ భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమా కంటే ముందు రవితేజ ఎన్నో ఫ్లాప్ సినిమాలు చేశారు. కానీ గోపీచంద్ మలినేని (Gopichand malineni) దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అందించింది. అయితే క్రాక్ మూవీ స్టోరీ కూడా మొదట బాలకృష్ణ కే వచ్చిందట.కానీ బాలకృష్ణ స్టోరీలో అంత కొత్తదనమేమి లేదు. స్టోరీ కామన్ గా ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారట. కానీ క్రాక్ మూవీ ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత గోపీచంద్ తో బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

అలా బాలకృష్ణ ఇప్పటివరకు టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాలను చేతులారా మిస్ చేసుకున్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు బాలకృష్ణ మిస్ చేసుకున్నారు. ఈ సినిమాలు గనుక బాలకృష్ణ చేసుంటే ఆయన రేంజ్ మరింత పెరిగేది అని ఈ విషయం తెలిసినట్లు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×