Adilabad district News: కార్డెన్ సెర్చ్‌కు వెళ్లిన పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల తిరుగుబాటు చేశారు. అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి గమనించిన అధికారులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అసలేం జరిగింది? ఈ ఘటన జరిగింది ఎక్కడ? అనే లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామం ఈ ఘటనకు వేదికైంది. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. ఇళ్లల్లో లభించిన కలప, ఫర్నీచర్ స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడితో ఆగలేదు.. కోపంతో రెచ్చిపోయిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల వాహనాలపై దాడికి దిగారు.
పరిస్థితి గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొదట గ్రామంలో భారీగా కలప నిల్వలు ఉన్నాయంటూ అధికారులకు సమాచారం వెళ్లింది. అడవిలో లభించిన ఖరీదైన కలపతో రకరకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో బీట్ ఆఫీసర్ జాదవ్‌పై దాడి చేశారు కేశవపట్నం గ్రామస్తులు. ఈ విషయం తెలియగానే ఆ గ్రామానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులంతా ఏకమై పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, వాహనాలపై దాడికి దిగారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి గమనించిన అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. కలప వ్యవహారంలో గ్రామస్తులకు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే.
ALSO READ: హైడ్రా యాక్షన్ షురూ.. 8 అంతస్తుల బిల్డింగ్ ఫసక్
అటవీ శాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత
కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు వెళ్లిన అధికారులు
ఇళ్లల్లో దొరికిన కలప, ఫర్నీచర్ స్వాధీనం చేసుకునే క్రమంగా అడ్డుకున్న గ్రామస్తులు
అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన గ్రామస్తులు pic.twitter.com/JV9O262vSe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025