Bollywood:సినీ సెలబ్రిటీలు సినిమా స్టంట్ లో భాగంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. అనూహ్యంగా వివిధ గెటప్లలో రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కోవలోకే చేరిపోయారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan). ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. దీనికి కారణం ఆయన వేషధారణ అని చెప్పవచ్చు. అడవి మనిషిలా వేషం వేసుకొని ముంబై వీధుల్లో తిరగడంతో పాటు రోడ్లపై కూడా డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సడన్ గా ఈయనను చూసిన కొంత మంది భయపడి పోయి పారిపోయినట్లు సమాచారం. ఇకపోతే అడవి మనిషిలా, కొండ జాతి వేసుకొని ముంబై వీధుల్లో తిరుగుతుంటే కొంతమంది ఈయనను గుర్తుపట్టలేకపోయారు. ఇంకొంతమంది ఈయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం కాస్త బయటపడింది.
బ్రాండ్ ప్రమోట్ కోసం గెటప్ మార్చిన అమీర్ ఖాన్..
ఇక వీటిని చూసిన చాలామంది అయ్యో అమీర్ ఖాన్ ను కలిసే అవకాశం చేజారిపోయిందే అంటూ బాధపడుతున్నారు కూడా. అయితే నిజానికి ఇలా ఉన్నట్టుండి వేషధారణ మార్చి రోడ్లపై రావడానికి కారణం ఏంటి? అంటూ పలువురు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరికొంతమంది స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి పనులు చేయడం నచ్చలేదు అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అమీర్ ఖాన్ ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఇలా వేషం వేసినట్టు తెలుస్తోంది. కోకోకోలా ఇండియా ఛార్జ్డ్ అనే డ్రింక్ ను పరిచయం చేసింది కంపెనీ. తన ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి అమీర్ ఖాన్ ను ఎంచుకుంది. ఇక ఈ యాడ్ లో భాగంగా ఛార్జ్డ్ డ్రింక్ తీసుకున్న తర్వాత డాన్స్ చేసే విధంగా చాలా విభిన్నంగా అమీర్ ఖాన్ ను చూపించారు. ఇది చూసిన చాలామంది విమర్శలు గుప్పిస్తూ.. కనీసం సినిమా కూడా కాదు ఒక యాడ్ కోసం ఇలా చేయడం మీకు కరెక్టేనా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది బ్రాండ్ కి గొప్ప ప్రమోషన్ వచ్చింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వేషధారణ మార్చి రోడ్లపై తిరగడంతో పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
అమీర్ ఖాన్ కెరియర్..
అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రభావంతమైన నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన అసలు పేరు “మహమ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్”. నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు 7 ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇక 2003లో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ తో పాటు 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆయనను గౌరవించింది. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రీనా దత్తాను వివాహం చేసుకున్న ఈయన , ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయారు. 2015లో కిరణ్ రావ్ ను వివాహం చేసుకున్నారు.