Mobile Phone Side Effects: మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి.ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఎక్కువ సేపు వాడటంతో పాటు మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారు. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడటం వల్ల మీ బంధం బలపడుతుంది. కానీ ఈ అలవాటు మీకు చాలా హానికరం. ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల మీ శారీరక, మానసిక సమస్యలకు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ రోజుల్లో ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల మన ఆరోగ్యంపై అనేక దుష్ఫలితాలు ఉంటాయని చాలా మందికి తెలుసు కానీ లైట్ తీసుకుంటారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదు. ఫోన్‌లో ఎక్కువసేపు, వాడటం, మాట్లాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ సైడ్ ఎఫెక్ట్స్:
చెవులు దెబ్బతింటాయి:
ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల చెవులు పాడవుతాయి. ఫోన్‌ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన చెవులకు హానికరం. ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు, చెవి నొప్పి, టిన్నిటస్ వంటి సమస్యలు వస్తాయి.
మెదడుపై ప్రభావం:
ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం మన మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడు కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి లోపం, తలనొప్పి వంటి సమస్యలను కలుగుతాయి.
ఒత్తిడి , ఆందోళన:
ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. మనం ఫోన్‌లో మాట్లాడినప్పుడు, మన దృష్టి మరలుతుంది. ఫలితంగా మన చుట్టూ ఉన్న విషయాలపై దృష్టి పెట్టలేము. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది.
నిద్రలో ఆటంకం:
ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల కూడా మన నిద్రకు భంగం కలుగుతుంది. విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడును ప్రేరేపిస్తాయి.ఇది నిద్ర లేమికి దారి తీస్తుంది.
కళ్లపై ప్రభావం:
ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం మన కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్ స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన కళ్లకు హానికరం. ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల కంటి నొప్పి, చూపు మందగించడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కంటి సంబంధిత సమస్యలు చాలా వరకు పెరుగుతాయి.
బాడీ పెయిన్:
ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల కూడా మన శరీరంలో నొప్పి వస్తుంది. ఫోన్‌ని తప్పుగా పట్టుకోవడం లేదా ఒకే భంగిమలో ఎక్కువ సేపు ఉండడం వల్ల మెడ, భుజాలు , వీపు భాగంలో నొప్పి వస్తుంది.
Also Read: తిన్న తర్వాత 15 నిమిషాలు నడిస్తే.. మతిపోయే లాభాలు
జాగ్రత్తలు :
ఫోన్‌లో వీలైనంత తక్కువగా మాట్లాడండి.
ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హెడ్‌ఫోన్స్ లేదా స్పీకర్‌లను ఉపయోగించండి.
మీ శరీరానికి దూరంగా ఫోన్ ఉంచండి.
రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడకండి.
ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, నిటారుగా కూర్చుని మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి.