
Aishwarya Arjun Marriage : సీనియర్ నటుడు అర్జున్.. ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒక పది సంవత్సరాల క్రితం వరకు మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు. అలాగే తన నట వారసురాలిగా కూతురిని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి సెటిల్ చేయాలి అనుకున్నాడు.
అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా తమిళ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అర్జున్ కానీ అతని కూతురు కానీ ఈ రూమర్స్ కి ఎప్పుడు స్పందించింది లేదు. అయితే ఈ రూమర్స్ ను నిజం చేస్తూ ఇప్పుడు వీరిద్దరూ వచ్చే సంవత్సరం జూన్ లో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
అర్జున్ కూతురు ఐశ్వర్య 2013లో పట్టట్టు యానై అనే తమిళ్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత 2018లో ప్రేమ బరా చిత్రంతో కన్నడ ఇండస్ట్రీ ని కూడా పలకరించింది. తెలుగులో కూడా హీరోయిన్ గా కూతురు ఎంట్రీ ఇవ్వాలి అన్న ఆశ తో విశ్వక్ సేను హీరో గా ఒక మూవీ స్టార్ట్ చేశాడు అర్జున్. అయితే కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి విశ్వక్ తప్పుకున్నాడు. ఇక ఆ సినిమాల అర్ధాంతరంగా ఆగిపోయింది.
కెరీయర్ అంతగా కలిసి రాలేదు అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి చాలా రోజుల నుంచి నలుగుతున్న ఐశ్వర్య ప్రేమకు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అర్జున్ స్వయంగా చెన్నైలో నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఎంతో సింపుల్ గా వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయినప్పటికీ ఇంకా డేట్ రివీల్ చేయలేదు. అయితే వీళ్ళిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఇక ఐశ్వర్య పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తోందట. మరి పెళ్లి తర్వాత కెరీయర్ కంటిన్యూ చేస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.