Dhanush Kubera.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోలు పాత్రకు అనుగుణంగా మారిపోవడమే కాదు.. ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ లో, అవసరమైతే తమకు నచ్చిన వాటిని ట్రై చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు దర్శకులుగా, నిర్మాతలుగా కూడా పనిచేస్తూ మంచి పేరు దక్కించుకుంటూ ఉంటే.. మరికొంతమంది సింగర్లుగా కూడా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి చాలామంది హీరోలు తమ సినిమాలలో పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి ధనుష్ (Dhanush) కూడా చేరిపోయారు.
కుబేర కోసం పాట పాడిన..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ధనుష్. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న చిత్రం కుబేర (Kubera). దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో భాస్కరభట్ల (Bhaskarabhatla)రాసిన హీరో ఇంట్రడక్షన్ పాటను ధనుష్ స్వయంగా పాడినట్లు సమాచారం. చెన్నైలో ఈ పాటను రికార్డు చేశారట. ఇక ఈ పాట హీరో ఇంట్రడక్షన్ గీతమే కానీ కొత్త శైలిలో ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా సంచలనాలు సృష్టించిన ధనుష్.. సింగర్ గా మారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఏది ఏమైనా తన స్వరంతో థియేటర్ లు దద్దరిల్లేలా చేయబోతున్నారు ధనుష్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
కుబేర సినిమా విశేషాలు..
ధనుష్, నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇదివరకే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నుంచీ గ్లింప్స్ విడుదల చేయగా భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ప్రచార చిత్రంలో ఎలాంటి సంభాషణలు వినిపించకపోయినా.. పాత్రల తాలూకు లోతును..మనసుకు హత్తుకునేలా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ముంబై కేంద్రంగా సాగే కథ అన్నట్టుగా తెలుస్తోంది.ఈ గ్లింప్స్ లో బిచ్చగాడి తరహా గెటప్ లో ధనుష్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. కుక్కపిల్లను పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన ఈ షాట్, భారీ మొత్తంలో డబ్బుల కట్టలతో నిండి ఉన్న గదిలో నాగార్జున నిల్చొని ఉండడం, డీ గ్లామర్ లుక్ లో రష్మిక కనిపించిన తీరు అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం కథ ఏంటి? దీంట్లో పాత్రల స్వభావం ఏమిటి? అనేది మాత్రం స్పష్టత రాకుండా ఈసారి శేఖర్ కమ్ముల ఒక కొత్తదనం నిండిన కథతో మన ముందుకు రాబోతున్నారు అని అయితే స్పష్టం అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అని చెప్పవచ్చు.