BigTV English

Kiran Abbavaram:పెళ్లికి ముందు కిరణ్ అబ్బవరం ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు?

Kiran Abbavaram:పెళ్లికి ముందు కిరణ్ అబ్బవరం ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు?

Hero Kiran Abbavaram emotional post about his upcoming movie song: షార్ట్ ఫిలింస్ తో కెరీర్ మొదలుపెట్టాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. హీరోగా రాజావారు..రాణీవారు మూవీలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీలో నటించాడు. అది ఫర్వాలేదనిపించినా యావరేజ్ గానే ఆడింది. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అయింది. తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తో హీరో రేసులో బాగా వెనకబడ్డాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరంకు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో..ప్రెజెంట్ ‘క’ అనే మూవీలో నటిస్తున్నాడు కిరణ్.


రూ.15 కోట్ల బడ్జెట్

‘క’ మూవీ నూతన నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి తెలుగు మూవీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే ఈ మూవీకి ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. అసలు మార్కెట్టే లేని ఫ్లాపుల్లో ఉన్న హీరోపై ఇంత భారీ ఖర్చుపెడున్న నిర్మాతను అందరూ భయపెడుతున్నారు. అయినా ఆ నిర్మాత కిరణ్ అబ్బవరంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే ఈ యంగ్ హీరో త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు. కిరణ్ గత ఐదేళ్లుగా హీరోయిన్ రహస్య గోరక్ తో ప్రేమలో ఉన్నాడు. రహస్య గోరక్ రాజావారు రాణివారు మూవీలో కిరణ్ అబ్బవరంతో కలిసి నటించింది. ఈ జంటకు ఆ మూవీతో మంచి పేరు కూడా వచ్చింది. రహస్య గోరక్ లక్స్ యాడ్ లో నటించి లక్స్ పాపగా పేరు తెచ్చుకుంది.


పెళ్లి ఫిక్స్

గత మార్చిలోనే ఇద్దరీకి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. అయితే ఆగస్టు 22న ఇద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు వీరినుంచి. అయితే కిరణ్ వివాహానికి ముందు ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. తాను నటిస్తున్న ‘క’మూవీ నుంచి ఓ అప్ డేట్ ఇచ్చాడు. అందులో వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోందంటూ..ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ బాగా కంపోజ్ చేశారని..ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు. అయితే K. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. ఇంత మంచి పాటను మా పెళ్లి కానుకగా ముందుగానే అందించిన శ్యామ్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం.

హిట్ కాంబో..

శ్యామ్, కిరణ్ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి షార్ట్ ఫిలింస్ ఎన్నో చేశారు.
‘క’ సినిమాపై ఇస్తున్న అప్ డేట్స్ అన్నీ కూడా ఆ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ మూవీకి విడుదలకు ముందే రూ.30 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది. కిరణ్ అబ్బవరం లైఫ్ లో ఈ రేంజ్ లో బిజినెస్ అయిన సినిమా ఇదే కావడం విశేషం. ఇది పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్ల ర్ గా ఈ మూవీ రూపొందుతోంది. సుజీత్, సందీప్ అనే ఇద్దరు యువ దర్శక ద్వయం ఈ మూవీకి దర్శకులు. ఈ మూవీతోనే దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు కిరణ్ కు జతగా. నయన్ సారిక, తన్వీరామ్ . ఈ మూవీ తనకు ఓ ఛాలెంజింగ్ రూల్ అంటున్నాడు కిరణ్ అబ్బవరం. పాజిటివ్ తో పాటు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయంటున్నాడు.

<iframe width=”864″ height=”486″

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×