Dilruba Movie : ఓ సినిమా చేశారంటే… ఫాస్ట్‌గా రిలీజ్ చేసి… థియేటర్స్‌లోకి పంపించాలని చూస్తారు హీరోలు. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అవ్వడం హీరోకు ఇష్టం లేకపోతే… ఏదేదో కారణాలు చెబుతారు. ఇది ఇండస్ట్రీలో ఎప్పుడూ కనిపించే వ్యవహారం.
ఇది పక్కన పెడితే… ఇప్పుడు ఓ హీరో డబ్బింగ్ చెప్పడానికి ముందుకు రావడం లేదట. వచ్చే నెలలో ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. అయినా… ఇంకా ఆ మూవీకి సంబంధించి డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదట. ఆ హీరోను డబ్బింగ్ గురించి తొందర పెడితే…. నేను ఇప్పుడు రాలేను. నాకు గొంతు నొప్పి ఉంది అంటూ కారణాలు చెబుతున్నాడట. దీంతో ఏం చేయలేక తల పట్టుకుంటున్నారట ఆ మూవీ నిర్మాతలు..
గొంతు నొప్పితో డబ్బింగ్ చెప్పలేకపోతున్న ఆ హీరో ఎవరు..?
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఏం చేయలేక తలలు పట్టుకుంటున్న నిర్మాతలు ఎవరో ఇప్పుడు చూద్ధాం…
శివమ్ సెల్యులాయిడ్స్, మ్యూజిక్ లేబుల్ సరిగమ కి చెందిన ఏ యూడ్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా దుల్ రూబా అనే మూవీని నిర్మిస్తున్నారు. దీనికి విశ్వ కరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే వాయిదా పడింది…
నిజానికి ముందుగా అనుకున్న దాని ప్రకారం… ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సింది. డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు మేకర్స్.
తాజాగా, కొద్ది రోజుల క్రితం కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. మర్చి 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ, ఈ మూవీ మార్చి 14న కూడా రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది.
డబ్బింగ్ చెప్పాలేను…
ఈ దుల్ రూబా మూవీ డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందట. హీరో గారిని మూవీ టీం సంప్రదిస్తే… ప్రస్తుతం తాను డబ్బింగ్ చెప్పడం కుదరదని, తనకు గొంతు నొప్పి ఉందని కారణాలు చెబుతున్నాడట. రిలీజ్ డేట్‌కు మరో నెల రోజుల టైం కూడా లేకపోవడంతో నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.