BigTV English

IND vs PAK Ticket price: ఫ్యాన్స్ కు షాక్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 4 లక్షలు?

IND vs PAK Ticket price: ఫ్యాన్స్ కు షాక్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 4 లక్షలు?

IND vs PAK Ticket price: దాయాది పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇరుదేశాల క్రీడాభిమానులు మాత్రమే కాకుండా.. ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. వరల్డ్ క్రికెట్ లో పాకిస్తాన్ – భారత్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతోంది. ప్రతి మ్యాచ్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు.


Also Read: Virat Kohli: బీసీసీఐ కండిషన్స్.. దుబాయిలో వాంతులు చేసుకున్న కోహ్లీ.. ఆ ఫుడ్ ఎఫెక్ట్ ?

ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా.. స్టేడియం హౌస్ ఫుల్ కావాల్సిందే. ఇప్పుడు అదే క్రేజ్ తో భారత్ – పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరోసారి తలపడబోతున్నాయి. ఫిబ్రవరి 23న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కి బ్లాక్ మార్కెట్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల ధరలు బ్లాక్ మార్కెట్లో చుక్కలను చేరాయి.


అధికారికంగా టికెట్లు దొరకని అభిమానులు.. బ్లాక్ మార్కెట్ ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దుబాయ్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం గ్రాండ్ లాంచ్ టికెట్లు సుమారు ఒక్కొక్కటి నాలుగు లక్షలకు బ్లాక్ మార్కెట్ సైట్లలో కనిపిస్తున్నాయి. ఇదే స్టాండ్స్ లో కొన్ని బెస్ట్ సీట్లకు ధర మరింత ఎక్కువగా ఉంది. సాధారణ స్టాండ్ ల ధరలు కూడా అఫీషియల్ రేట్ల తో పోలిస్తే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

దీంతో బ్లాక్ లో టిక్కెట్లు కొనాలని ప్రయత్నించిన వారు అవకవుతున్నారు. అయితే ఐసీసీ ఈ టికెట్ల ధరను దిర్హామ్ 5 వేలు {రూ. 1,18,240.90} గా నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో కొన్ని వెబ్ సైట్ లు అసలు ధరను మూడింతలు చేసి అమ్ముతున్నాయి. ఈ బ్లాక్ టికెట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అనుమతులను పొందితే దుబాయిలో టికెట్లను రీసెల్ చేయడం లీగల్.

Also Read: Lisa Sthalekar: తల్లిదండ్రులు వద్దనుకున్నారు.. అనధాశ్రమం నుండి ఆస్ట్రేలియా క్రికెటర్ గా లీసా ప్రయాణం

ఈ కారణంగానే ఫుల్ హైప్ ఉన్న మ్యాచ్ ల టికెట్లను కొందరు ఇలా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతుంటారు. ఇప్పుడు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ని కూడా క్యాస్ట్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెటర్స్ రంగంలోకి దిగారు. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ని చూడాలని క్రీడాభిమానులు ఎంత ఖర్చుకైనా వెనకాడట్లేదు. ఇక భారతజట్టు ఇప్పటికే దుబాయిలో అడుగుపెట్టి ప్రాక్టీస్ సెషన్ ని ఆదివారం నుండే ప్రారంభించింది. భారత్ తన తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ప్రారంభించబోతోంది. ఈ తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీని విజయవంతంగా ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×