BigTV English

Hero Mahesh’s viral post: వారికి అసలు మానవత్వం లేదా అంటూ మహేశ్ వైరల్ పోస్ట్

Hero Mahesh’s viral post: వారికి అసలు మానవత్వం లేదా అంటూ మహేశ్ వైరల్ పోస్ట్

mahesh babu latest news


Hero Mahesh’s viral post saying that they have no real humanity(Tollywood Celebrity news): సూపర్ స్టార్ మహేశ్ బాబు యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. కొత్త ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఎంతగానో అలరించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ మిక్స్‌డ్ టాక్‌ని ఈ మూవీ సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు నటించబోయే నెక్స్ట్ మూవీ దర్శక ధీరుడు రాజమౌళీ డైరెక్షన్‌లో చేయనున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్‌కి ఏదైనా మూవీ కానీ, వెబ్‌సిరీస్ కానీ నచ్చితే దాన్ని మెచ్చుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఆ మూవీకి సంబంధించిన పోస్ట్‌లు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.


Read More:  ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షురూ.. వీడియో షేర్ చేసిన మంచు విష్ణు

ఇదిలా ఉంటే..ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ నెల 23 నుంచి అమెజాన్ ఫ్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ చూసిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారట. అసలు అలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా అంటూ తన ఆవేదనని వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్ లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు.

Read More: డబ్బింగ్ మూవీతో జక్కన్న కొడుకు టాలీవుడ్ ఎంట్రీ

కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ ఫోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్ తో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా స్టోరీని తీసుకొని ఈ మూవీని రూపొందించారు. పోచర్ లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్ నే సిరీస్ గా రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ నటి అలియా భట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×